Telangana Municipal Elections Live Updates: తెలంగాణలోని 116 మునిసిపాలిటీలు, ఏడు కార్పోరేషన్ల పరిధిలోని వార్డు, డివిజన్లకు నేడు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది. ఈ పోలింగ్‌లో మొత్తం 52,17,413 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఓటర్లలో పురుషుల(25,49,750) కంటే మహిళలే(26,67,025) అధికంగా ఉన్నారు. ఇతరులు 638 మంది ఉన్నారు. అయితే.. ఇప్పటికే 116 మునిసిపాలిటీల్లోని మొత్తం 2,582 వార్డులకు గానూ ఇప్పటికే 12 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. నారాయణపేట జిల్లాలోని మక్తల్ మున్సిపాలిటీలోని ఒక వార్డులో ఎన్నిక వాయిదా పడింది. మిగిలిన 2,569 వార్డుల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఈ ఎన్నికలకు సంబంధించి ఎన్టీవీ లైవ్ అప్డెట్స్ మీకోసం..
READ MORE: Telangana Municipal Elections: తెలంగాణలో ఎన్నికల పోరు షురూ..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మందకొడిగా పోలింగ్..
1.మంచిర్యాల కార్పొరేషన్‌లో 9.71 శాతం
2.ఆదిలాబాద్ మున్సిపాల్టీలో 10.7 శాతం.
3.ఆసిఫాబాద్ లో 15.82 శాతం.
4.కాగజ్ నగర్ లో 10.19 శాతం.
5.ఖానాపూర్ పోలింగ్ శాతం 9.8
6.చెన్నూర్.14.83శాతం.
7.బెల్లంపల్లి 12.44
8.క్యాతన్ పల్లి లో 14 శాతం
9.లక్షేట్టిపేట 14% పోలింగ్ నమోదు.
10.నిర్మల్.6.89 శాతం.
11.భైంసాలో 11.91 శాతం పోలింగ్ నమోదు.
వరంగల్: ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న మున్సిపల్ పోలింగ్.. ఉదయం 9 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం వివరాలు.. జనగామ మున్సిపాలిటీలో 10.59 % పోలింగ్ నమోదు
భూపాలపల్లి మున్సిపాలిటీలో 12.0% పోలింగ్ నమోదు
తొర్రూరు మున్సిపాలిటీలో 8.77%పోలింగ్ నమోదు
స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీలో 11.53%పోలింగ్ నమోదు
ములుగు మున్సిపాలిటీలో 10.19%పోలింగ్ నమోదు
వర్ధన్నపేట మున్సిపాలిటీలో 13.02%పోలింగ్ నమోదు
నర్సంపేట మున్సిపాలిటీలో 12.29%పోలింగ్ నమోదు
మహబూబాబాద్ మున్సిపాలిటీలో 10.58 %పోలింగ్ నమోదు
డోర్నకల్ మున్సిపాలిటీలో 13.11% పోలింగ్ నమోదు
పరకాల మున్సిపాలిటీలో 9.20% పోలింగ్ నమోదు
కేసముద్రం మున్సిపాలిటీలో 13.36% పోలింగ్ నమోదు
మరిపెడ మున్సిపాలిటీలో 16.32% పోలింగ్ నమోదు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: భూపాలపల్లి మున్సిపాలిటీ లో ఓ వైపు ఎన్నికల పోలింగ్.. మరో వైపు డబ్బు కట్టల కలకలం.. 22వ వార్డు పోలింగ్ కేంద్రం సమీపంలో డబ్బు విసిరేసి పరారైన ఓ బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు.. 22వ వార్డు కు చెందిన బీఆర్ఎస్ అభ్యర్థి బుర్ర రమాదేవికి చెందిన ఓ వ్యక్తి ఓటర్ డబ్బు పంచేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకునే క్రమంలో డబ్బు వదిలేసి పరార్.. సుమారు 1లక్ష రూపాయల డబ్బు స్వాధీనం చేసుకొని వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..
మెదక్: నర్సాపూర్ మున్సిపాలిటీ 15వ వార్డులో ఉద్రిక్తత.. బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ.. చొక్కాలు పట్టుకుని కొట్టుకున్న బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు.. ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు
ఆదిలాబాద్ మున్సిపాల్టీలో 10.7 శాతం పోలింగ్..
ఆసిఫాబాద్ లో 15.82 శాతం.
కాగజ్ నగర్ లో 10.19 శాతం.
ఖానాపూర్ పోలింగ్ శాతం 9.8
చెన్నూర్.14.83శాతం.
బెల్లంపల్లి 12.44
క్యాతన్ పల్లి లో 14 శాతం
లక్షేట్టిపేట 14% పోలింగ్ నమోదు.
కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతున్న మున్సిపల్ పోలింగ్.. ఉదయం 9 గంటల వరకు కరీంనగర్ కార్పొరేషన్ లో 9.18 శాతం పోలింగ్ నమోదు
ధర్మపురిలో 16.42 శాతం పోలింగ్
జగిత్యాల 13.23 శాతం
హుజురాబాద్ 11.71 శాతం
సుల్తానాబాద్ 15.75 శాతం
పెద్దపల్లి 11.12 శాతం
జమ్మికుంట 7.74 శాతం
చొప్పదండి 12. 47 శాతం
మంథని 15.01 శాతం
రాయికల్ 12.97 శాతం
వేములవాడ 14.10 శాతం
కోరుట్ల 10.38 శాతం
మెట్ పల్లి 10.30 శాతం
సిరిసిల్ల 12.18 శాతం
రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 11.16% పోలింగ్ నమోదు
రంగారెడ్డి జిల్లా లో మొదటి రెండు గంటల్లో 11.75శాతం పోలింగ్ నమోదు
Shadnagar- 11.84
Chevella- 11.54
Ibrahimpatnam- 12.21
Moinabad- 12.41
Amangal- 11.42
Sankerpally- 9.26
మేడ్చల్ జిల్లా అలియాబాద్ లాల్గాడి మలక్పేట్‌లో భారీ బందోబస్తు.. నిన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య గొడవ.. నిన్న కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన మేడ్చల్ డీసీపీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్.. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా సమావేశం ఎలా నిర్వహిస్తారు అంటూ అడ్డుకోబోయిన బీఆర్ఎస్ కార్యకర్తలు.. ఇరు వర్గాల మధ్య గొడవ.. ఈరోజు ఎలాంటి గొడవలు తలెత్తకుండా.. ముందు జాగ్రత్తగా భారీ బందోబస్తు..
మక్తల్ లో ఎరుకల మహదేవప్ప కుటుంబాన్ని పరామర్శించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. మక్తల్ మున్సిపాలిటీలో 6వ వార్డ్ బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గిరిజన బిడ్డ మహాదేవప్ప.. కాంగ్రెస్ పార్టీ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి మహాదేవప్ప.. ఎరుకల మహదేవప్ప కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం... మీడియాతో మాట్లాడిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. మహదేవప్ప కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందని హామీ..
ప్రజాపాలన ప్రభుత్వంలో ఎన్నికలు పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించబడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారు.. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినప్పటికీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టి ప్రజలకు సంక్షేమ పథకాలను సమర్థంగా అందిస్తుంది. ప్రస్తుత ప్రజాపాలనలో ఎక్కడా పోలీసు ఒత్తిడి లేదని స్పష్టం మైంది. గత ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యాన్ని హరించి, ఎన్నికలు నిర్వహించకుండా బెదిరింపులకు పాల్పడి ఏకగ్రీవాలు చేయించిన ఘటనలు ఉన్నాయి: మంత్రి వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల: జిల్లా కేంద్రంలోని 227వ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్న కార్మిక & మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి.. తన నివాసం నుంచి నడుచుకుంటూ వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి..
రంగారెడ్డి జిల్లా: ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల్లో 240 మంది ఎన్నికల అధికారులు... మొత్తం 24 వార్డులు.. 19 లొకేషన్లలో 48 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు.. మొత్తం 4 రెవెన్యూ విలేజ్ లు.. సీతారాంపేట్, శేరిగూడ, ఖానాపూర్, ఇబ్రహీంపట్నం.. 83 మంది కౌన్సిలర్ అభ్యర్థులు.. మొత్తం ఓటర్లు 25,993..
మహబూబ్‌నగర్: 45వ డివిజన్ 5వ బూత్‌లో నిలిచిన పోలింగ్.. సింబల్స్ తారుమారు కావడంతో నిలిచిన పోలింగ్..పోలింగ్ కేంద్రం వద్ద అభ్యర్థుల ఆందోళన
గద్వాల మున్సిపాలిటీలో 37 వార్డులలో 108 పోలింగ్ బూత్‌లలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం..
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న పోలింగ్.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1 కార్పొరేషన్, 10 మున్సిపాలిటీల్లో పోలింగ్..
మంచిర్యాల కార్పొరేషన్‌లో 60 డివిజన్‌లు, ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 49 వార్డులు, బెల్లంపల్లి లో 44, చెన్నూరులో 18, క్యాతనపల్లిలో 22 వార్డులకు పోలింగ్..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీలకు నేడు పోలింగ్.. 260 వార్డులకు బరిలో నిలిచిన 1072 మంది అభ్యర్థులు.. 12 మున్సిపాలిటీల్లో 525 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు.. ఓటు హక్కు సద్వినియోగం చేసుకోనున్న 3,35,272 మంది ఓటర్లు.. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్.. పోలింగ్ నిర్వహణ కోసం 2,100 మందికి పైగా సిబ్బంది నియామకం.. మొత్తం మూడువేల మంది పోలీస్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ డే.. అత్యధిక మున్సిపాలిటీలు ఉన్న నియోజకవర్గం పటాన్ చెరు.. నియోజకవర్గంలో ఐదు మున్సిపాలిటీలు.. ఇంద్రేశం, ఇస్నాపూర్, గుమ్మడిదల, జిన్నారం, గడ్డపోతారం మున్సిపాలిటీలు
ఇస్నాపూర్ మున్సిపాలిటీలో 24 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్‌లు..