Municipal Election Nominations: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సమరం రసవత్తరంగా మారుతోంది. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా రెండో రోజైన గురువారం అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్స్ వేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఎన్నికల కోలాహలం నెలకొంది. తొలిరోజు నామమాత్రంగా సాగిన ఈ ప్రక్రియ.. రెండో రోజుకు చేరుకునేసరికి ఒక్కసారిగా వేగం పుంజుకుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని వెల్లడించిన వివరాల ప్రకారం..
WPL 2026 Final: గ్రేస్ ఆల్‌రౌండ్ సత్తా, మంధాన కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ ఫైనల్‌కు ఆర్సీబీ!
రెండో రోజు రాష్ట్రవ్యాప్తంగా 7,980 మంది అభ్యర్థుల నుంచి 8,326 నామినేషన్లు అందాయి. మొదటి రోజుతో కలిపి ఇప్పటివరకు మొత్తం నామినేషన్ల సంఖ్య 9,276కు చేరుకుంది. ఇందులో పార్టీల వారీగా చూస్తే.. కాంగ్రెస్ 3,379 (అత్యధికం), బీఆర్ఎస్ 2,506, బీజేపీ 1,709, బీఎస్పీ 142, ఎంఐఎం 166, ఇండిపెండెంట్లు 918, సీపీఐ(ఎం) 88, ఆప్ 17, టీడీపీ 10, ఇతర గుర్తింపు పొందిన పార్టీల నుండి 141 నామినేషన్స్ వచ్చాయి.
ఇక నామినేషన్ల దాఖలుకు నేడు (శుక్రవారం) సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే గడువు ఉండటంతో.. చివరి రోజు అభ్యర్థుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. గడువు ముగిసే సమయానికి కార్యాలయ ప్రాంగణంలో ఉన్న వారందరికీ నామినేషన్లు వేసే అవకాశం కల్పిస్తామని కమిషన్ స్పష్టం చేసింది.
