WPL 2025 Eliminator: నేడు ఎలిమినేటర్ మ్యాచ్.. డబ్ల్యూపీఎల్ ఫైనల్ చేరేదెవరో!
- నేడు డబ్ల్యూపీఎల్ 2025 ఎలిమినేటర్ మ్యాచ్
- ఫేవరెట్‌గా బరిలోకి ముంబై
- ఎలిమినేటర్‌లో గెలిచిన టీమ్ ఫైనల్‌లో ఢిల్లీతో ఢీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2025లో నేడు కీలక పోరు జరగనుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో రాత్రి 7.30 నుంచి మ్యాచ్ ఆరంభం అవుతుంది. డబ్ల్యూపీఎల్ 2025లో ఇప్పటికే గుజరాత్‌పై రెండుసార్లు గెలిచిన ముంబై.. ఎలిమినేటర్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. అంతేకాదు సొంతగడ్డపై ఆడుతుండడం కూడా ముంబైకి కలిసొచ్చే అంశం.
హేలీ మాథ్యూస్, నాట్‌సీవర్ బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్, అమేలియా కెర్, యాస్టికా భాటియా వంటి బ్యాటర్లతో ముంబై బ్యాటింగ్ బలంగా ఉంది. ముఖ్యంగా హేలీ మెరుపు ఆరంభాలను ఇవ్వడమే కాకుండా.. తన ఆఫ్‌స్పిన్‌తోనూ రాణిస్తోంది. సూపర్ ఫామ్‌లో ఉన్న నాట్‌సీవర్ టోర్నీలో ఇప్పటికే నాలుగు అర్ధ శతకాలు చేసింది. ఎనిమిది మ్యాచ్‌లల 416 పరుగులు చేయడమే కాకుండా.. 8 వికెట్లు పడగొట్టింది. హర్మన్‌ప్రీత్ గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసి చేసింది. బౌలింగ్‌లో అమేలియా కెర్, హేలీ, నాట్‌సీవర్ ముంబైకి బలం.
Also Read
ఆష్లీ గార్డ్‌నర్ సారథ్యంలోని గుజరాత్‌కు ముంబైని ఓడించడం సవాలే. గార్డ్‌నర్ 235 పరుగులతో రాణించింది. అయితే ముంబైతో జరిగిన మ్యాచ్‌లో డకౌటైంది. హర్లీన్ డియోల్, బెత్ మూనీ, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, డియాండ్రా డాటిన్ మెరవాలని టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది. గార్డ్‌నర్ సహా మేఘనా సింగ్, ప్రియా మిశ్రాలు బంతితోనూ రాణించడం కీలకం. ఎలిమినేటర్‌లో గెలిచిన టీమ్ ఫైనల్‌లో ఢిల్లీతో తలపడనుంది. లీగ్ దశ ముగిసేసరికి పట్టికలో అగ్ర స్థానంతో నిలిచిన ఢిల్లీ.. నేరుగా ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే.
తుది జట్లు:
ముంబై: హేలీ మాథ్యూస్, అమేలియా కెర్, నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), అమంజోత్ కౌర్, యాస్తిక భాటియా (కీపర్), సజీవన్ సజన, జి కమలిని, సంస్కృతి గుప్తా, షబ్నిమ్ ఇస్మాయిల్, పరునికా సిసోడియా.
గుజరాత్: బెత్ మూనీ (కీపర్), కష్వీ గౌతమ్, హర్లీన్ డియోల్, ఆష్లీ గార్డనర్ (కెప్టెన్), ఫోబ్ లిచ్‌ఫీల్డ్, డియాండ్రా డాటిన్, భారతీ ఫుల్మాలి, సిమ్రాన్ షేక్, తనూజా కన్వర్, మేఘనా సింగ్, ప్రియా మిశ్రా.
తాజావార్తలు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!