Site icon NTV Telugu

Maharashtra: అవినీతి కారణంగా ముంబై మునిగిపోయింది.. ప్రభుత్వంపై విరుచుకుపడిన ఉద్ధవ్ సేన

Maharashtra

Maharashtra

Maharashtra: శివసేన (యూబీటీ)కి చెందిన సామ్నా తన తాజా సంపాదకీయంలో రుతుపవనాల సన్నద్ధత, ముంబయిలో వరదల నిర్వహణపై మహారాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించింది. అవినీతి కారణంగా నగరం మునిగిపోయిందని పేర్కొంది. శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) నేతృత్వంలోని మరాఠీ వార్తాపత్రిక సామ్నా బీజేపీ, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే హయాంలో ముంబై మునిసిపల్ కార్పొరేషన్ బిల్డర్లు, కాంట్రాక్టర్ల నియంత్రణలోకి వచ్చిందని పేర్కొంది.

బీజేపీ వ్యాపారులు, కాంట్రాక్టర్ల పార్టీ అని, ముంబై నగరం, నగర మునిసిపల్ కార్పొరేషన్‌తో భావోద్వేగ సంబంధం లేదని, అందుకే వారు నగరంలో పరిస్థితి గురించి పట్టించుకోవడం లేదని సంపాదకీయం పేర్కొంది. నగరంలో తీవ్రమైన వరదల గురించి సామ్నా సంపాదకీయం మాట్లాడుతూ, బ్రిటిష్ కాలంలో నిర్మించిన నగరం డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని పేర్కొంది. దీని కారణంగా, ముంబై జోషిమత్‌గా మారడానికి ఎక్కువ సమయం పట్టదని వెల్లడించింది. పౌరసంఘంలో ప్రజాప్రతినిధులు లేకపోవడంతో ముంబైలోని రోడ్లు, డ్రెయిన్లు శుభ్రం చేశారని, తొలి వర్షంకే ముంబై మునిగిపోయి ప్రజలు ఇబ్బందులు పడ్డారని సంపాదకీయం పేర్కొంది.

Also Read: Delhi Cabinet: ఢిల్లీ కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ.. అతిషికి ఫైనాన్స్, ప్లానింగ్, రెవెన్యూ శాఖలు!

రుతుపవనాల నిర్వహణపై మహారాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే కాకుండా, ముంబైలో 400 కిలోమీటర్ల పొడవైన రోడ్ల నిర్మాణానికి సంబంధించి 6,000 కోట్ల రూపాయల “భారీ కుంభకోణం” జరిగిందని సామ్నా పత్రిక ఆరోపించింది. ఈ పనికి టెండర్ పొందిన ఐదు కంపెనీల వెనుక ముఖ్యమంత్రి నిజమైన సూత్రధారి అని సంపాదకీయం ఆరోపించింది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దీనిపై కళ్లు మూసుకుందని తెలిపింది.

Exit mobile version