ముంబై పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు గురువారం బెదిరింపు కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీని హత్య చేయడానికి ప్లాన్ చేసినట్లు పేర్కొంది. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. కాల్ చేసిన వ్యక్తి మహిళగా గుర్తించారు. ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆమెను పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.
READ MORE: BRSV State Secretary: బీఆర్ఎస్‌వీ స్టేట్ సెక్రటరీ నాగారం ప్రసాద్ అరెస్ట్..
పోలీసుల సమాచారం ప్రకారం.. ముంబై ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్‌రూమ్‌కు గురువారం ఉదయం ఓ బెదిరింపు కాల్ వచ్చింది. ఓ మహిళ మాట్లాడుతూ.. ప్రధాని మోడీని హతమార్చేందుకు ప్లాన్ చేసినట్లు తెలిపింది. ఈ హత్య కోసం ప్రత్యేకంగా ఓ ఆయుధాన్ని కూడా సిద్ధం చేసినట్లు బెదిరించింది. ఈ కాల్ తర్వాత అధికారులు అలర్ట్ అయ్యారు. వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. అయితే.. ఫోన్ చేసిన మహిళ మానసికంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండొచ్చని పోలీసుల ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.
READ MORE: Bajrang Punia: నేను బీజేపీలో చేరి ఉంటే ఏ నిషేధం ఉండేది కాదు.. నాడాపై బజరంగ్ పునియా ఫైర్
గత ఏడాది జులైలో కూడా ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఇలాంటి బెదిరింపు కాల్ వచ్చింది. అందులో ప్రధాని మోడీని, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ని చంపేస్తామని హెచ్చరించారు. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తుతెలియని వ్యక్తి ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌లోని ల్యాండ్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి ప్రధానిని, యూపీ సీఎంను చంపేస్తానని బెదిరించాడు. కాల్ చేసిన వ్యక్తి దేశంలో “26/11 తరహా దాడి” చేస్తామని బెదిరించినట్లు కూడా నివేదించబడింది.
,