NTV Telugu Site icon

Helmetless Cops : మీరే ఇలా హెల్మెట్ లేకుండా స్కూటర్ నడిపితే ఎలా ?

Traffic

Traffic

Helmetless Cops : హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం. టూ వీలర్ నడిపే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. ఒకవేళ హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే పోలీసులు భారీ జరిమానా విధిస్తారు. ఈ రూల్ లింగం, వృత్తితో సంబంధం లేకుండా అందరికీ వర్తిస్తుంది. అలాంటిది పోలీసులు ఈ నియమాలు అతిక్రమిస్తే సామన్యులు ప్రశ్నిస్తారు కదా.. ఇప్పుడు ముంబయిలో అదే జరిగింది. హెల్మెట్ లేకుండా ఇద్దరు మహిళా పోలీసులు వాహనం నడుపుతున్న ఫోటోను ట్విట్టర్ యూజర్ ఒకరు పోస్ట్ చేయడంతో ఈ న్యూస్ వైరల్ అవుతోంది.

Read Also: Earthquake : అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ భూ ప్రకంపనాలు

టూ వీలర్ నడిపే వ్యక్తులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. ఈ రూల్ లింగం, వృత్తితో మొదలైన వాటితో సంబంధం లేకుండా అందరికీ సమానంగా వర్తిస్తుంది. చట్టానికి అందరూ ఒకటే. ఇందులో ఎలాంటి ఆశ్చర్యమూ లేదు. అయితే ముంబైకి చెందిన ఇద్దరు మహిళా పోలీసులు హెల్మెట్ లేకుండా స్కూటీపై ప్రయాణించారు. దీనిని ఒకరు ఫొటో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఇది ప్రస్తుతం నెటింట్లో చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

Read Also: Umair Sandhu: బన్నీ-రష్మిక రిలేషన్షిప్… అది ట్విట్టరా లేక టాయిలెట్ కమోడా?

ఈ ట్వీట్ షేర్ చేసిన వెంటనే ముంబై పోలీసులు స్పందించారు. ఎక్కడి నుంచి ఫొటో తీశారో కచ్చితమైన లొకేషన్ తెలియజేయండి అని కోరారు. దీనికి పోస్ట్ చేసిన రాహుల్ సమాధానమిస్తూ.. ఈ ఘటన ఈస్ట్రన్ ఎక్స్ ప్రెస్ హైవే (దాదర్) వద్ద జరిగిందని తెలిపారు. మళ్లీ ఒక గంట తరువాత ముంబై పోలీసులు సమధానం ఇచ్చారు. ‘‘వారిపై చర్యలు తీసుకోవాలని మేము మాతుంగా ట్రాఫిక్ విభాగానికి మీ అభ్యర్థనను పంపించాం’’ అని తెలిపారు.

Show comments