Mumbai: సుఖంగా జీవించాలన్న కోరికతో కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. కొందరు దొంగతనాలు, మోసాలు, స్మగ్లింగ్లు చేస్తుంటే మరికొందరు పడక వృతిని చేపడుతున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు చిక్కి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ముంబై పోలీసులు హైప్రొఫైల్ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఓ భోజ్‌పురి నటిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమాయక మహిళలను వ్యభిచార కూపంలోకి లాగిన సుమన్ కుమారి అనే నటిని అరెస్టు చేశారు. గోరేగావ్‌లోని ఆరే కాలనీలోని రాయల్ పామ్ హోటల్‌లో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. నిందితులను ట్రాప్ చేసేందుకు పోలీసులు నకిలీ కస్టమర్‌ను హోటల్‌కు పంపారు. ఒక్కో మోడల్‌కు రూ. 50,000 నుంచి రూ. 80,000 రూపాయల డబ్బులు తీసుకుని విటుల వద్దకు పంపిస్తూ ఉంది.
Read Also : Disha Patni : పూజకు వెళుతూ ఆ బట్టలేంటి.. కొంచమైనా ఉండాలి
సుమన్ కుమారి సినిమాల్లో హీరోయిన్లుగా రాణించాలని అనుకుని ముంబైకి వచ్చిన యువతుల డబ్బు అవసరం గుర్తించి వారిని ఈ కూపంలోకి దింపేది. ఆమె అనేక భోజ్‌పురి చిత్రాల్లో నటించింది. లైలా మజ్నుతో పాటు, ఆమె బాప్ నంబ్రి బేటా దస్ నంబ్రి వంటి భోజ్‌పురి కామెడీ షోలను కూడా చేసింది. బూమ్ OTT ఛానెల్‌లో కూడా పనిచేసింది. ముంబై పోలీస్ సోషల్ సర్వీస్ బ్రాంచ్ నటిని అరెస్టు చేసింది. పోలీసుల విచారణ ప్రకారం, సుమన్ కుమారి ఆరేళ్లుగా ముంబైలో నివసిస్తోంది. ఈమె హిందీ, పంజాబీ మ్యూజిక్ ఆల్బమ్‌లలో కూడా పనిచేసింది. అయితే ఆమె సెక్స్ రాకెట్‌లో ఎప్పుడు పని చేయడం ప్రారంభించిందనే సమాచారం అందుబాటులో లేదు.