ఐపీఎల్ 2024లో భాగంగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో గెలుపొంది. 197 పరుగుల లక్ష్యాన్ని 15.3 ఓవర్లలోనే చేధించింది. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ కేవలం 19 బంతుల్లో 52 పరుగులు చేశాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు మిస్టర్ 360. అతని ఇన్నింగ్స్ లో 4 సిక్స్ లు, 5 ఫోర్లు ఉన్నాయి. ఓపెనర్లు రోహిత్ శర్మ (38), ఇషాన్ కిషన్ (69) శుభారంభాన్ని అందించారు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ అలవోకగా విజయం సాధించింది.
Rajnath Singh: తల్లి అంత్యక్రియల కోసం పెరోల్ ఇవ్వలేదు.. కాంగ్రెస్ ఎమర్జెన్సీ పాలనపై కేంద్రమంత్రి..
అటు.. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా 6 బంతుల్లో (21) పరుగులు చేశాడు. తిలక్ వర్మ (16) పరుగులు చేశాడు. ఈ విజయంతో.. ముంబై వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. బెంగళూరు బౌలర్లలో ఆకాశ్ దీప్, వైశాఖ్, విల్ జాక్స్ తలో వికెట్ సంపాదించారు. ముంబై బ్యాటర్లను కట్టడి చేయడంలో విఫలమయ్యారు. ఆర్సీబీ ఈ ఓటమితో నాలుగు మ్యాచ్ ల్లో ఓడిపోయింది.
Off The Record : కృష్ణుడు లేకుండానే కురుక్షేత్రం.!
అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ డుప్లెసిస్ (61), చివరలో దినేష్ కార్తీక్ (53), రజత్ పాటీదార్ (50) పరుగులతో రాణించారు. ఈ మ్యాచ్ లో ఓపెనర్లుగా బరిలోకి దిగిన కోహ్లీ (3) పరుగులు చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ డుప్లెసిస్ ఈ మ్యాచ్ లో రాణించాడు. ఆ తర్వాత విల్ జాక్స్ (8) పరుగులు చేశాడు. రజత్ పాటీదార్ (50) పరుగులతో రాణించాడు. కాగా.. మ్యాక్స్ వెల్ డకౌట్ అయి ఈ మ్యాచ్ లో కూడా నిరాశపరిచాడు. మహిపాల్ లోమ్రోర్ కూడా డకౌట్ అయ్యాడు. సౌరవ్ చౌహన్ (9) పరుగులు చేశాడు. ముంబై బౌలింగ్ లో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లతో చెలరేగాడు. కోయోట్జీ, మద్వాల్, శ్రేయాస్ గోపాల్ తలో వికెట్ తీశారు.
