NTV Telugu Site icon

CSK vs MI: 5 వికెట్లను కోల్పోయిన ముంబయి.. 10 ఓవర్లలో స్కోరు ఇలా..

Csk Vs Mi

Csk Vs Mi

CSK vs MI: CSK vs MI: ఇండియన్​ ప్రీమియర్ లీగ్​ 16 సీజన్‌లో భాగంగా ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఐపీఎల్ దిగ్గజ టీంలు ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ప్రత్యర్థి​ జట్టు ముంబయికి బ్యాటింగ్​ అప్పగించింది. బ్యాటింగ్‌కి దిగిన రోహిత్ సేన 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(21), ఇషాన్ కిషన్‌(32)లు జోరుగా మ్యాచ్‌ను ప్రారంభించినా ఎక్కువ సేపు నిలదొక్కుకోలేక పోయారు. తుషార్ దేశ్‌పాండే వేసిన నాలుగో ఓవ‌ర్‌లో రోహిత్ శ‌ర్మ(21) బౌల్డ్ అయ్యాడు. తొలి బంతిని స్టాండ్స్‌లోకి పంపిన అత‌ను ఆఖ‌రి బంతికి ఔట‌య్యాడు. ధాటిగా ఆడుతున్న ముంబై ఓపెన‌ర్ ఇషాన్ కిష‌న్(31)ను రవీంద్ర జడేజా ఔట్ చేశాడు. ఇషాన్ గాల్లోకి లేపిన బంతిని బౌండ‌రీ వ‌ద్ద ప్రిటోరియ‌స్ అందుకున్నాడు. దాంతో, 64 వ‌ద్ద ముంబై రెండో వికెట్ కోల్పోయింది. అనంతరం వచ్చిన సూర్యకుమార్ యాదవ్(1) సాంట్నర్ బౌలింగ్‌లో వెంటనే ఔటయ్యి వెనుదిరిగాడు.

ఆల్‌రౌండ‌ర్ కామెరూన్ గ్రీన్ స్పిన్నర్ ర‌వీంద్ర జ‌డేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. జడేజా వేసిన 9వ ఆల్‌రౌండ‌ర్ కామెరూన్ గ్రీన్(12) బంతిని పైకి లేపగా.. రిచ‌ర్న్ క్యాచ్ ప‌ట్టి ఔట్ చేశాడు. దాంతో, ముంబై నాలుగో వికెట్ కోల్పోయింది. సాంట్నర్ వేసిన 10వ ఓవర్‌లో అర్షద్ ఖాన్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దాంతో ముంబై ఐదు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. చెన్నై బౌలర్లు రవీంద్ర జడేజా, మిచెల్ సాంట్నర్‌లు తలో రెండు వికెట్లు తీయగా.. తుషార్ దేశ్ పాండే ఒక వికెట్ తీశాడు. ప్రస్తుతం క్రీజులో తిలక్ వర్మ(11), టిమ్ డేవిడ్(3) ఉన్నారు.