ప్లేఆప్స్ రేసు రసవత్తరంగా సాగుతుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. గుజరాత్ టైటాన్స్ 12 మ్యాచ్‌ల్లో 9 గెలిచింది. 18 పాయింట్లతో గుజరాత్ టైటాన్స్ జట్టు అఫీషియల్ గా ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. గుజరాత్ చేతిలో ఢిల్లీ ఓడిపోవడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు తమ నెట్ రన్ రేట్ ఆధారంగా ప్లేఆఫ్‌లోకి అడుగుపెట్టాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 12 మ్యాచ్‌ల్లో 17 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో నిలిచి ప్లేఆఫ్‌లోకి ప్రవేశించింది.
Also Read:Nara Rohit : బాబాయ్.. ఏదేమైనా నీకు తోడుగా ఉంటా.. మనోజ్ పై నారా రోహిత్..
పంజాబ్ కింగ్స్ 12 మ్యాచ్‌ల్లో 17 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఇప్పుడు ప్లేఆఫ్స్‌లో నాల్గవ స్థానం కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో జట్లు పోటీపడుతున్నాయి. ముంబై ఇండియన్స్ జట్టు 12 మ్యాచ్‌ల్లో 14 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ 12 మ్యాచ్‌ల్లో 13 పాయింట్లతో మూడవ స్థానంలో ఉంది. ఆ తర్వాత రేసులో లక్నో నిలిచింది. ఈ పరిస్థితుల్లో ముంబై ఇండియన్స్ ఆడాల్సిన రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. ఆ రెండు మ్యాచ్‌ల్లో ముంబై ఓడిపోతే ఎలిమినేట్ అవుతుంది.
Also Read:BCCI: భారత్-పాక్ ఉద్రిక్తతలు.. పాకిస్తాన్‌ను ఒంటరిని చేసేందుకు బీసీసీఐ సంచలన నిర్ణయం..!
ఢిల్లీ క్యాపిటల్స్ మిగిలిన రెండు మ్యాచ్‌లలో గెలిస్తే అప్పుడు 17 పాయింట్లతో ఢిల్లీ ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తుంది. లక్నో సూపర్ జెయింట్స్ 11 మ్యాచ్‌ల్లో 10 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది. LSG మిగతా మూడు మ్యాచ్‌ల్లో గెలవాలి. అయితే లక్నో మిగతా రెండు జట్లపై ఆధారపడాల్సి ఉంది. ముంబై ఇండియన్స్ ,ఢిల్లీ క్యాపిటల్స్ మిగతా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోతే అప్పుడు LSG ప్లేఆఫ్‌కు చేరుకునే అవకాశం ఉంటుంది. కాగా GT విజయం రెండు జట్లను ప్రభావితం చేయడంతో అభిమానులు కూడా లీగ్ చివరి దశలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఈ సమరం నుంచి ఇప్పటికే చెన్నై, సన్ రైజర్స్, రాజస్థాన్, కేకేఆర్ జట్లు తప్పుకున్నాయి.
