Site icon NTV Telugu

Filmmaker Arrested: భార్యను కారుతో ఢీకొట్టిన బాలీవుడ్‌ సినీ నిర్మాత అరెస్ట్

Filmmaker

Filmmaker

Filmmaker Arrested: భార్యపై కారు ఎక్కించిన బాలీవుడ్ సినీ నిర్మాత కమల్ కిషోర్ మిశ్రాను ముంబై పోలీసులు గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. సినీ నిర్మాత తాను వేరే మహిళతో ఉండటాన్ని గుర్తించిన భార్యను కారుతో ఢీకొట్టాడు. సినీ నిర్మాత కమల్ కిషోర్ మిశ్రా వాహనంలో మరో మహిళతో ఉండటాన్ని గమనించిన తన భార్యపైకి తన కారును ఎక్కించపోయాడు. ఈ ఘటన ముంబయిలోని అంబోలీ పీఎస్‌ పరిధిలో ఈ నెల 19న చోటుచేసుకుంది. కిషోర్ భార్య యస్మీన్ (35) కారును అడ్డగించబోగా, కమల్ కిషోర్ కారును ఆమెపైకి పోనివ్వడానికి ప్రయత్నించగా.. ఆమెకు గాయాలైన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో గత వారం సామాజిక మాధ్యమాల్లో వెలుగు చూసింది. ఈ ఘటనలో నిర్మాత భార్య కాలికి గాయాలయ్యాయి.

DMK Leader on Khushboo: సినీ నటి ఖుష్బూ పెద్ద ఐటమ్.. డీఎంకే నేత వివాదస్పద వ్యాఖ్యలు

ముంబైలో వాహనంలో వేరొక మహిళతో కలిసి కనిపించిన తన భార్యపై తన కారును ఢీకొట్టినందుకు సినీ నిర్మాత కమల్ కిషోర్ మిశ్రాను ముంబై పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున అరెస్టు చేసినట్లు ఒక అధికారి తెలిపారు. అక్టోబరు 19న అంధేరి (పశ్చిమ)లోని జంట అపార్ట్‌మెంట్‌లోని పార్కింగ్ స్థలంలో మిశ్రా భార్య కారులో మరో మహిళతో కలిసి ఉన్నట్లు ఆరోపించిన సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. తన భర్త వివాహేతర సంబంధంలో ఉన్నాడని, అక్కడి నుంచి తప్పించుకునేందుకు కారును వేగంగా ముందుకు పోనిచ్చాడంటూ యస్మీన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దేహతి డిస్కో, భూటియాప, ఫ్లాట్ నంబర్ 420, ఖల్లి బల్లి, శర్మాజీ కి లగ్ గయ్ చిత్రాలకు సహ నిర్మాతగా కమల్ కిశోర్ వ్యవహరించారు.

Exit mobile version