Kabaddi:కొన్నాళ్లుగా హార్ట్ ఎటాక్ తో మరణించే వారి సంఖ్య పెరుగుతోంది. అప్పటి వరకు ఉత్సాహంగా కనిపించిన వారు ఉన్నట్లుండి పడిపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ తరహా ఘటనలు ఎక్కువ కావడం ఆందోళనకు గురిచేస్తోంది. చిన్నవయసు వారే ఊహించని విధంగా మరణిస్తుండడం విషాదం నింపుతోంది. సోషల్ మీడియా పుణ్యమాని ఇలాంటి ఘటనలు జరిగిన కొన్ని క్షణాల్లోనే ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Read Also: Kim Wife: కిమ్ మాత్రమే కాదు.. ఆయన భార్య ఏం చేసినా సంచలనమే
పూర్తి వివరాలు.. ముంబయికి చెందిన 20 ఏళ్ల క్రితిక్ రాజ్ అనే కాలేజీ స్టూడెంట్ కాలేజీలో జరిగిన కబడ్డీ టోర్నీలో పాల్గొన్నాడు. ఈ సమయంలో క్రితిక్ రాజ్ ప్రత్యర్థి కోర్టులోకి కూతకు వెళ్లాడు. అయితే ప్రత్యర్థి జట్టు విద్యార్థులు క్రితిక్ రాజ్‌ను ఒక్కసారిగా అడ్డుకున్నారు. దీంతో రాజ్ ఓటమిని అంగీకరించేశాడు. అయితే తిరిగి తన జట్టు కోర్టులోకి నడుచుకుంటూ వెళ్తోన్న సమయంలో రాజ్ ఒక్కసారిగా కింద పడిపోయాడు. దీంతో తోటి విద్యార్థులు క్రితిక్ రాజ్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ విద్యార్థి అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. మరణానికి గుండెపోటే కారణమని డాక్టర్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. క్రితిక్ రాజ్ ముంబయిలోని సంతోష్ నగర్‌లో నివసిస్తూ ఉండేవాడు.
Read Also: Indian Solder: ఇండియన్ సోల్జర్ను ముద్దాడిన టర్కీష్ మహిళ