NTV Telugu Site icon

Bank Scam: ఆ బ్యాంకులో రూ.122 కోట్లు స్వాహా.. నిందితుడు మాజీ మేనేజర్ అరెస్ట్!

Bank Sceam

Bank Sceam

న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో జరిగిన అవకతవకలపై దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) ప్రధాన నిందితుడు హితేష్ మెహతాను అరెస్టు చేసింది. మొదట హితేష్ మెహతాకు సమన్లు పంపింది. హితేష్ నివాస స్థలానికి వెళ్లిన పోలీసులు విచారణ జరిపారు. అనంతరం హితేష్ అరెస్టు చేశారు. ముంబైకి చెందిన న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్‌పై వ్యాపార నిషేధం విధించింది.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI). ఈ బ్యాంకు పనితీరులో అవకతవకలు జరిగినట్లు ఆర్‌బీఐ పేర్కొంది. బ్యాంకు బోర్డును రద్దు చేసి, కార్యకలాపాల పునరుద్ధరణ కోసం ఆర్‌బీఐ ఓ నిర్వాహకుడిని నియమించింది. బ్యాంకులోని కొంతమంది ఉద్యోగులు నిధులను దుర్వినియోగం చేశారని, దీని వల్లే ఈ సంక్షోభం ఏర్పడిందని వర్గాలు తెలిపాయి. ఆర్‌బీఐ ప్రకటన తర్వాత.. ఆందోళన చెందిన కస్టమర్లు నిన్న ఉదయం నుంచి తమ డబ్బును తమకు తిరిగి ఇవ్వాలని బ్యాంకు వద్దకు పరుగులు తీశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని బ్యాంకు ఆవరణలోకి అనుమతించలేదు.

READ MORE: Telangana: రేపటి నుండి 28 వరకు కులగణన రీ సర్వే..

ఈ కేసులో మాజీ జనరల్ మేనేజర్ హితేష్ ప్రవీణ్‌చంద్ మెహతా ప్రధాన నిందితుడిగా పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మెహతా బ్యాంకు నుంచి రూ.122 కోట్లు అపహరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన జనరల్ మేనేజర్ పదవిలో ఉన్నప్పుడు ఈ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. బ్యాంకు చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ దాదర్ పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ స్కామ్‌లో హితేష్ కాకుండా మరో వ్యక్తి కూడా పాల్గొనే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసును తదుపరి దర్యాప్తు కోసం ఆర్థిక నేరాల విభాగం (EOW)కి అప్పగించారు. ఈ స్కామ్ 2020 నుంచి 2025 మధ్య జరిగినట్లు ముంబై పోలీసులు తెలిపారు. తాజాగా నిందితుడు ఈ బృందం అరెస్ట్ చేసింది.