Site icon NTV Telugu

Man killed Woman: తనకంటే ఏడేళ్లు చిన్నవాడితో డేటింగ్.. పెళ్లి అనగానే మర్డర్

Murder

Murder

Man killed Woman: ఢిల్లీ శ్రద్ధా కేసు మరిచిపోకముందే ఆ తరహా ఘటనలు దేశంలో తరచూ ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మహారాష్ట్రలోని థానే జిల్లాలో సహ జీవనం చేస్తున్న మహిళను హత్య చేశాడు ఓ వ్యక్తి. ఈ కేసులో 30 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నవంబర్ 7, 2022న అంబర్‌నాథ్‌లోని నెవ్లీ ప్రాంతంలోని ఇంట్లో 37 ఏళ్ల మహిళ శవమై కనిపించిందని ఉల్హాస్‌నగర్ డివిజన్‌లోని హిల్‌లైన్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ రంజిత్ డేరే తెలిపారు.

Read Also: Bank Deposit Insurance Scheme : బ్యాంకు దివాళా తీసినా.. మీకు రూ.5లక్షలు వస్తాయి ఎలాగో తెలుసా?

మహిళను చీరతో ఉరివేసి చంపారని, ఆమె శరీరంపై కత్తిపోట్లు ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఇంటి తలుపు బయటి నుంచి తాళం వేసి ఉందన్నారు. అకోలా నుంచి వచ్చిన వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడిందన్నారు. వారిద్దరూ కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారని తెలిపారు. అతడు స్థానిక నిర్మాణ సంస్థలో డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు విచారణలో తేలింది.

Read Also: World Record : తిండితిప్పలు లేకుండా 13వేల కి.మీ..11రోజుల ప్రయాణం

మహిళ తనను పెళ్లి చేసుకోవాలనుకుంటోందని.. ఈ విషయమై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని పోలీసు అధికారి వివరించారు. సంఘటన జరిగిన రోజు కూడా వారి మధ్య గొడవ జరిగిందని, హత్య చేసి నిందితుడు పారిపోయారని తెలిపారు. నిందితుడిని బుధవారం ఔరంగాబాద్‌లో అరెస్టు చేసినట్లు పోలీస్ అధికారి డేరా తెలిపారు. నిందితుడు మరొక కేసులో కూడా దోషిగా నిర్ధారించబడి జైలు శిక్ష అనుభవించినట్లు దర్యాప్తులో తేలిందని చెప్పారు.

Exit mobile version