NTV Telugu Site icon

Mukul Rohatgi: అటార్నీ జనరల్‌గా కేంద్రం ఆఫర్‌.. నో చెప్పిన ముకుల్ రోహత్గీ

Mukul Rohatgi

Mukul Rohatgi

Mukul Rohatgi: ప్రభుత్వ అత్యున్నత న్యాయవాది అయిన భారత అటార్నీ జనరల్‌గా తిరిగి రావాలని కేంద్రం చేసిన ప్రతిపాదనను సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ తిరస్కరించారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆదివారం చెప్పారు. అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌(91) పదవీ కాలం ఈ నెల 30వ తేదీతో ముగియనుండటంతో ఆ పదవికి రోహత్గీని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడం తెలిసిందే. వేణు గోపాల్‌ కూడా ఆరోగ్యో కారణాలతో ఈ పదవిలో మరింతకాలం కొనసాగనని ఇప్పటికే చెప్పారు. అటార్నీ జనరల్‌గా వేణుగోపాల్ మొదటి పదవీకాలం 2020లో ముగియగా, తన వయస్సు దృష్ట్యా తన బాధ్యతల నుండి తనను తప్పించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. మరో పర్యాయం కొనసాగాలని ప్రభుత్వం కోరింది. రెండు సంవత్సరాల పాటు రెండో సారి కూడా కొనసాగారు. ఇక వయస్సు సహకరించకపోవడం వల్ల తనను తప్పించాలని కోరగా.. ముకుల్‌ రోహత్గీ బాధ్యతలు స్వీకరించాలని కేంద్రం ప్రతిపాదించింది.

Ghulam Nabi Azad: నేడు కొత్త రాజకీయ పార్టీని ప్రకటించనున్న గులాం నబీ ఆజాద్!

కానీ ముకుల్‌ రోహత్గీ ఈ ఆఫర్‌ను తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఒకటికి రెండుసార్లు ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. 67 ఏళ్ల ముకుల్ రోహత్గీ 2014 నుంచి 2017వరకు అటార్నీ జనరల్‌గా పనిచేశారు. ఒకవేళ కేంద్రం ఆఫర్‌కు ఆయన ఓకే చెప్పి ఉంటే ఈ పదవిని రెండోసారి చేపట్టేవారు. ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ గుజరాత్ ప్రభుత్వం తరపున ప్రాతినిధ్యం వహించిన గుజరాత్ అల్లర్ల కేసుతో సహా దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టుతో పాటు దేశవ్యాప్తంగా హైకోర్టులలో అనేక ఉన్నత స్థాయి కేసులలో హాజరయ్యారు. నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్ కమిషన్‌కు సంబంధించిన కేసును కూడా ఆయన వాదించారు. ఇటీవల, డ్రగ్స్-క్రూయిజ్ కేసులో అరెస్టయిన షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ రక్షణ బృందానికి రోహత్గీ నాయకత్వం వహించాడు.

Show comments