NTV Telugu Site icon

Mukesh Ambani: లగ్జరీ ఇల్లు అమ్మేసిన ముకేశ్ అంబానీ..

Mukesh Ambani

Mukesh Ambani

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ గురించి ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో వైరల్ అవువుంది. తనకు చెందిన ఒక లగ్జరీ ప్రాపర్టీని అమ్మేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికాలోని మ్యాన్‌హట్టన్ వెస్ట్ విలేజ్‌లో ఒక విలాసవంతమైన ఇల్లును విక్రయించాడట. నాలుగో ఫ్లోర్‌లో 2406 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ లగ్జరీ ఇంటిని 9 మిలియన్ డాలర్లకు అంటే భారత కరెన్సీలో రూ.74.5 కోట్లకు అమ్మివేసినట్లు తెలుస్తోంది.

Read Also: Photoshoot: పురుషుల నగ్నత్వాన్ని చిత్రీకరిస్తున్న మహిళ

ఈ ఇల్లు హడ్సన్ నదీ తీరాన ఉంది.. ఇందులో రెండు బెడ్‌రూంల నుంచి ఈ నది చుట్టూ ప్రకృతి అందాలను చూసేందుకు అందంగా నిర్మించారు. లోపల కూడా అత్యాధునిక సౌకర్యాలతో దీని నిర్మాణం చేపట్టారు. ఈ ఇంటి ఇంటీరియర్ డిజైన్‌ను అత్యద్భుతంగా రూపొందించారు. పది అడుగుల ఎత్తులో సీలింగ్స్, హెరింగ్‌బోన్ హార్డ్‌వుడ్ ఫ్లోర్స్, బయటి శబ్ధాలు లోపలికి వినిపించకుండా నిరోధించే కిటికీలు వంటి లేటెస్ట్ సౌకర్యాలు ఉన్నాయి.

Read Also: Hardik Pandya Trolls: హార్దిక్‌ పాండ్యాకు ఇంత స్వార్ధమా.. కాస్త ఎంఎస్ ధోనీని చూసి నేర్చుకో!

ఇక అంబానీకి ముంబయిలో ఆంటిలియా అనే ఇల్లు కూడా ఉంది. ఇది ప్రపంచంలోనే రెండో అత్యంత ఖరీదైన నివాసంగా పేరుగాంచింది. ఇక దీని విలువ రూ.15 వేల కోట్లకుపైనే ఉంటుంది. సుమారు 27 అంతస్తుల ఈ భవనంలో 60 ఫ్లోర్స్ ఉంటాయి. ఇందులోనే హెలిప్యాడ్, టెంపులు, సినిమా థియేటర్, స్విమ్మింగ్ పూల్, స్పా వంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ బిల్డింగ్ లో దాదాపు 600 మందికిపైగా సిబ్బంది పనిచేస్తుంటే.. వీరికి ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున నెలజీతం ఉంటుందని సమాచారం. ఇవి కాకుండా అంబానీకి ఇంకా అమెరికా, యూకే, దుబాయ్ వంటి దేశాల్లో కూడా విలాసవంత ఇళ్లు ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also: Bommarillu Bhaskar : డీజే టిల్లు తో సినిమాను సెట్ చేస్తున్న టాలెంటెడ్ డైరెక్టర్..?

గతేడాది అరబ్ సిటీ దుబాయ్‌లో ఏకంగా రూ. 640 కోట్లు పెట్టి ఓ లగ్జరీ విల్లా ముకేశ్ అంబానీ కొన్నాడు. దుబాయ్ పామ్ జుమైరాలో ఉన్న ఈ ఇల్లును తన చిన్న కుమారుడు అనంత్ అంబానీకి ఇచ్చాడు. అంతకుముందు లండన్‌లోని బకింగ్‌హాంషైర్ దగ్గర 300 ఎకరాల్లోని స్టోక్‌పార్క్‌ను రూ.592 కోట్లు పెట్టి తన పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీకి ఇచ్చినట్లు సమాచారం.