Bommarillu Bhaskar : డీజే టిల్లు తో సినిమాను సెట్ చేస్తున్న టాలెంటెడ్ డైరెక్టర్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిద్దు జొన్నలగడ్డ.ఈ యంగ్ హీరో ఇండస్ట్రీ కి వచ్చి చాలా కాలం అయింది.జోష్ మరియు ఆరెంజ్ వంటి సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన సిద్దు గుంటూరు టాకీస్ సినిమా తో హీరోగా మారిపోయారు.ఆ సినిమాలో హీరో గా సిద్దూ ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయ్యాడు. ఈ సినిమా తర్వాత పలు సినిమాలలో హీరో గా నటించిన అంతగా ఆకట్టుకోలేకపోయాయి.అయితే గత ఏడాది డీజే టిల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. సినిమాలో సిద్దూ క్యారెక్టర్, బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ఈ సినిమాతో సిద్దూ కు హీరో గా మంచి గుర్తింపు లభించింది.ఇక ఈ సినిమా మంచి హిట్ కావడంతో ఈయనకు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం సిద్దు డీజే టిల్లు సినిమాకు సీక్వల్ గా వస్తున్న టిల్లు స్క్వేర్ సినిమా షూటింగ్ పనులతో పాటు ఇతర సినిమాలలో కూడా నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు.ఇదిలా ఉండగా తాజాగా సిద్దూ కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.
బొమ్మరిల్లు సినిమా ద్వారా దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ భాస్కర్ ఆరెంజ్ సినిమాతో ఊహించని డిజాస్టర్ ను అందుకున్నారు. అనంతరం ఈయన అఖిల్ హీరోగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు. అయితే త్వరలోనే బొమ్మరిల్లు భాస్కర్ సిద్దు జొన్నలగడ్డతో సినిమా చేయనున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆరెంజ్ సినిమా లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన సిద్దు జొన్నలగడ్డతో ఏకంగా ఓ సినిమా చేయబోతున్నారు అంటే ఇది నిజంగానే గ్రేట్ అని చెప్పాలి. అయితే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా దాదాపు ఫిక్స్ అయిందని సమాచారం.ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను కూడా ఆగస్టు 10వ తేదీ ఘనంగా జరుపబోతున్నారని సమాచారం. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని విషయాలను కూడా త్వరలోనే అధికారకంగా ప్రకటించనున్నట్లు సమాచారం.
Also Read
- Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
తాజావార్తలు
-
Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!