Site icon NTV Telugu

Ayodhya Ram Mandir: బాలరాముడికి అంబానీ కుటుంబం విరాళం.. ఎన్ని కోట్లు ఇచ్చారంటే..!

Mukesh Ambani

Mukesh Ambani

ఈరోజు అయోధ్యలో జరిగిన రామ్ లల్లా ప్రాణప్రతిష్ట మహోత్సవానికి ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ తన కుటుంబంతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా.. ఆయన అయోధ్యలోని రామమందిర ట్రస్ట్‌కు రూ.2.51 కోట్లు విరాళంగా అందజేశారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు ముఖేష్ అంబానీ తన కుటుంబ సభ్యులతో కలిసి రూ. 2.51 కోట్లు విరాళంగా ఇచ్చారని కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ముఖేష్ అంబానీ తన భార్య నీతా, కుమార్తె ఇషా, అల్లుడు ఆనంద్ పిరమల్, కుమారులు ఆకాష్, అనంత్, కోడలు శ్లోకా మెహతా, త్వరలో కాబోయే కోడలు రాధికా మర్చంట్‌లతో కలిసి బాలరాముడి ప్రాణప్రతిష్ట వేడుకకు హాజరయ్యారు.

Read Also: Amit Shah: అయోధ్య రామమందిరం సనాతన సంస్కృతికి అపూర్వ చిహ్నంగా నిలిచిపోతుంది..

ఈ సందర్భంగా ముకేశ్ అంబానీ మాట్లాడుతూ.. అయోధ్యలో రామ మందిరం యొక్క పవిత్ర ప్రయత్నం లోతైన సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉందని తెలిపారు. అంతేకాకుండా.. ఈరోజు రాముడు వస్తున్నాడని, జనవరి 22న దేశవ్యాప్తంగా రామ్ దీపావళి జరుపుకుంటుందని ముకేశ్ అంబానీ అన్నారు. నీతా అంబానీ మాట్లాడుతూ.. ఇది చారిత్రాత్మకమైన రోజు అని అన్నారు. ఇది చరిత్రలో లిఖించదగిన రోజు అని రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ చెప్పారు. అత్యంత పవిత్రమైన ఈరోజున తాను ఇక్కడ ఉన్నందుకు ఎంతో ఆనందంగా ఉందని ఈషా అంబానీ తెలిపారు.

Read Also: Pakistan: వైవాహిక అత్యాచారం కేసులో పాక్ కోర్టు ఇలాంటి తీర్పు ఇస్తుందని ఊహిస్తామా..?

Exit mobile version