Site icon NTV Telugu

Kerala: నలభై ఏళ్ల క్రితం రెండు హత్యలు.. ఆ రహస్యాన్ని దాచిపెట్టి బతకలేనంటూ..

Kerala

Kerala

దశాబ్దాల క్రితం.. యుక్తవయసులో చేసిన నేరాలు అతడిని వెంటాడాయి. ఓ ప్రమాదంలో పెద్ద కుమారుడు చనిపోగా.. చిన్న కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబం కూడా వరుస సమస్యలతో సతమతమవుతోంది. ఈ క్రమంలో మానసిక సంఘర్షణకు గురైన అతడు.. దాదాపు నలభై ఏళ్ల క్రితం రెండు హత్యలు చేశానంటూ పోలీసుల ముందు లొంగిపోయాడు. ఆ రహస్యాన్ని దాచిపెట్టి బతకడం ఇక తన వల్ల కావడం లేదని, అపరాద భారాన్ని మోయలేకపోతున్నానని చెప్పాడు.

Also Read:Allu Arjun : తెలుగువారంటే వైల్డ్ ఫైర్.. అల్లు అర్జున్ మాస్ స్పీచ్..

మొదట విస్తుపోయిన పోలీసులు.. తర్వాత దర్యాప్తు చేపట్టి ఆ రెండు కేసులను ఛేదించడంలో నిమగ్నమయ్యారు. కేరళలోని కొయ్కడ్కు చెందిన మహమ్మదాలి (53) మలప్పురం జిల్లాలోని వెంగరా పోలీస్ స్టేషనులో ఈ మేరకు నెల రోజుల క్రితమే లొంగిపోయాడు.1986 ప్రాంతంలో ఓ వ్యక్తి (20) తనను వేధించేవాడని, ఆత్మరక్షణలో భాగంగా అతడిని తన్నడంతో ఓ కాలువలో పడిపోయినట్లు మహమ్మదాలి పోలీసులకు చెప్పాడు. భయంతో పారిపోయి, రెండు రోజుల తర్వాత వచ్చి చూస్తే ఆ నీటిలోనే అతడు విగతజీవిగా పడి ఉన్నట్లు వివరించాడు.

Also Read:PM Narendra Modi: బ్రిక్స్ శిఖరాగ్ర సమ్మేళనంలో పాల్గొననున్న మోదీ.. బ్రెజిల్‌లో ఘన స్వాగతం..!

పోలీసులు దీన్ని సాధారణ మరణంగా పేర్కొని, మృతుడి తరపున ఎవరూ రాకపోవడంతో కేసును క్లోజ్ చేశారు. వెల్లయిల్ బీచ్ లో 1989లో మరో వ్యక్తిని హత్య చేసినట్లు నిందితుడు చెప్పడంతో పోలీసులు దానిపై ఆరా తీశారు. అప్పట్లో ఓ గుర్తుతెలియని మృతదేహం లభ్యమైన మాట వాస్తవమేనని, ఆధారాలు దొరక్కపోవడంతో ఆ కేసునూ మూసివేసినట్లు గుర్తించారు. ఈ రెండు కేసుల్లో పాత ఫైళ్లను బయటకు తీసే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. మహమ్మదాలి చెబుతున్న విషయాలు వాస్తవాలా?.. కాదా? అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Exit mobile version