NTV Telugu Site icon

Bangladesh: పెనం నుంచి పొయ్యిలో పడ్డ బంగ్లాదేశ్.. ఆ దేశంలో ఆర్మీ రూల్..

Bangladesh

Bangladesh

Bangladesh: బంగ్లాదేశ్ పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్లైంది. రిజర్వేషన్ కోటాకు నిరసగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో షేక్ హసీనా ప్రధాని పదవికీ రాజీనామా చేసి భారత్ పారిపోయి వచ్చింది. నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అక్కడ మతోన్మాదులు రెచ్చిపోతున్నారు. దేశ అంతర్గత భద్రత తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ అనేది ఆ దేశంలో లేనే లేదు. నిరసనల సమయంలో పోలీసులు టార్గెట్‌గా హత్యలు జరగడంతో, విధుల్లో చేరేందుకు వారు సుముఖత చూపించడం లేదు. దీంతో దేశవ్యాప్తంగా అత్యాచారాలు, హత్యలు, దోపిడీలు నిత్యకృత్యంగా మారాయి. చాలా మందిని బెదిరించి వారి ఆస్తుల్ని రాయించుకోవడం, మైనారిటీలను బెదిరించి ఉద్యోగాలకు రాజీనామా చేసేలా బలవంతం చేయడం లాంటి పనులు కొనసాగుతున్నాయి.

Read Also: CM Chandrababu: శ్రీవారి లడ్డూ వివాదంపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష.. టీటీడీ ఈవోకు కీలక ఆదేశాలు..

ఇక జమాతే ఇస్లామీ, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్‌పీ) వంటి మతోన్మాద పార్టీలు రెచ్చిపోతున్నాయి. బుర్ఖా ధరించకుంటే మహిళలపై దాడులు చేస్తున్నారు. ఇతర మతస్తులతో గుంజీలు తీయిస్తున్నారు. ఇలాంటి ఘటనల్ని అదుపు చేయడంతో అక్కడి తాత్కాలిక ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మహ్మద్ యూనస్ శాంతియుతంగా ఉండాలని కోరడం తప్పితే, ఎలాంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి ఉంది. దీంతో పరిస్థితి చక్కదిద్దేందుకు ఆర్మీ సాయం కోరారు.

పాలన అస్తవ్యస్తంగా మారడంతో మహ్మద్ యూనస్ బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకార్ ఉద్ జమాన్ కార్యాలయాని వెళ్లి మరీ బంగ్లాదేశ్ అంతర్గత పరిస్థితి గురించి చర్చించారు. ఆర్మీకి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అధికారాలను కట్టబెట్టింది. ఈ అంశానికి సంబంధించి బంగ్లాదేశ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాబోయే 60 రోజుల పాటు దేశంలో అంతటా జిల్లా మేజిస్ట్రేట్ పర్యవేక్షణలో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌లుగా పని చేయనున్నారు. ఈ పవర్స్ ద్వారా ఆర్మీ ప్రజలను అరెస్ట్ చేయడం, నిర్బంధించడం, అల్లర్లని అణిచివేయడానికి కాల్పులు జరడపడం వంటి అధికారాలను కలిగి ఉంటుంది.తాత్కాలిక ప్రభుత్వ న్యాయ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ ఈ నిర్ణయానికి కారణాన్ని వివరిస్తూ, చాలా చోట్ల పరిస్థితి విధ్వంసకరంగా ఉందని అన్నారు. పారిశ్రామిక ప్రాంతాలకు పెద్దపీట వేస్తూ.. ఈ పరిస్థితుల్లో సైన్యానికి మేజిస్ట్రేట్ అధికారాన్ని కల్పించామన్నారు.

Show comments