NTV Telugu Site icon

TS BJP: జగిత్యాలలో భోగ శ్రావణికి సహకరించేది లేదన్న ముదుగంటి..

Muduganti

Muduganti

తెలంగాణలో బీజేపీ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. అయితే, తాజాగా జగిత్యాలలో బీజేపీ నేతల తీరు కలకలం రేపుతుంది. ముఖ్య కార్యకర్తలతో ఓ ఫంక్షన్ హాల్ లో బీజేపీ ముఖ్య నేత ముదుగంటి రవీందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. జగిత్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ రాకపోవడంతో ఆయన అలిగారు. దీంతో మీడియా సమావేశంలో ముదుగంటి రవీందర్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి భోగ శ్రావణికి సహకరించేది లేదంటు ఆయన తేల్చి చెప్పారు. బీజేపీ అభ్యర్థికి టికెట్ ఇచ్చింది కేవలం ఒక నాయకున్ని గెలిపించడానికి అంటూ ముదుగంటి రవీందర్ రెడ్డి వెల్లడించారు.

Read Also: Shraddha Kapoor : మరో లగ్జరీ కారును కొన్న శ్రద్దా కపూర్..ఎన్ని కోట్లో తెలుసా?

కమలం పార్టీని వీడే యోచనలో బీజేపీ నియోజకవర్గ ముఖ్య నాయకుడు ముదుగంటి రవీందర్ రెడ్డి? ఉన్నారు అని జిల్లాలో కమలం శ్రేణులు అనుకుంటున్నారు. అయితే, అతి త్వరలో ఆధారాలతో కుట్రను బయటపెడుతా అని బీజేపీ ముఖ్యనేత ముదుగంటి రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానన్న ఆయన ప్రకటించారు. కార్యకర్తలకు నిరంతరం అండగా ఉంటానంటూ అభయం ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్య కార్యకర్తలతో ఓ ఫంక్షన్ హాల్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.

Read Also: Israel Hamas War: 24 గంటల్లో 704 మంది.. ఇజ్రాయెల్‌ దాడుల్లో మరణించారన్న హమాస్‌

అయితే, తాజాగా బీజేపీ పార్టీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను బీజేపీ కార్యాలయానికి ఆయన పంపారు. ఏడాదిన్నర క్రితం వరకు తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కమలం పార్టీ ఎదిగిందన్నారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో బీజేపీ కొంత డీలా పడిందని ఆయన చెప్పుకొచ్చారు. నాడు బీజేపీలో చేరినా.. నేడు కాంగ్రెస్ లో చేరినా తన లక్ష్యం మాత్రం ఒక్కటేనని రాజగోపాల్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ కుటుంబ అవినీతి పాలనను అంతం చేయడమే తన ఉద్దేశ్యమన్నారు.