మెగాస్టార్ చిరంజీవి హీరోగా, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఈ సినిమాను ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. సినిమా అవుట్‌పుట్‌పై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్న చిత్ర బృందం, తాజాగా సినిమా విడుదల తేదీ లాంచ్ కార్యక్రమంలో ఈ సినిమాకి పెయిడ్ ప్రీమియర్స్ ఉంటాయా, అలాగే టికెట్ ధరలు పెంచే అవకాశం ఉందా అనే దానిపై మాట్లాడారు.
Also Read : Mrunal Thakur : మృణాల్ కొత్త లవ్ స్టోరీ..
ఈ సినిమా నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ.. MSVG సినిమాకు మన దగ్గర ప్రీమియర్స్ వేయాలా వద్దా అనే దానిపై ఇంకా ఫైనల్ నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ప్రస్తుతం దీనిపై చర్చలు మాత్రమే జరుగుతున్నాయని చెప్పారు. ఇక టికెట్ ధరల పెంపు (హైక్స్) గురించి మాట్లాడుతూ, కేవలం మొదటి మూడు రోజులు మాత్రమే టికెట్ ధరలు పెంచేలా ప్లాన్ చేస్తున్నామని, దీనిపై కూడా త్వరలోనే ఒక నిర్ణయానికి వస్తామని తెలిపారు. అంటే, ఈ సినిమాకు విడుదల కంటే ముందే ప్రిమియర్స్ పడే అవకాశం ఉందనే చెప్పాలి. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించగా, వెంకీ మామ (వెంకటేష్) కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
