MS Narayana: ఘనంగా ఎంఎస్ నారాయణ మనవరాలు వివాహం.. టాలీవుడ్ ప్రముఖుల సందడి..!

Ms Narayana Granddaughter Nairuthi

Ms Narayana Granddaughter Nairuthi

MS Narayana Granddaughter Nairuthi Gets Married: తెలుగు చిత్రసీమలో పెళ్లిళ్ల సందడి కొనసాగుతోంది. తాజాగా దివంగత ప్రముఖ హాస్యనటుడు ఎంఎస్ నారాయణ కుటుంబంలో శుభకార్యం ఘనంగా జరిగింది. ఆయన మనవరాలు, దర్శకురాలు శశికిరణ్ నారాయణ కుమార్తె నైరుతి వివాహం అజయ్ కృష్ణతో వైభవంగా జరిగింది. నిశ్చితార్థం, వివాహ వేడుకలను వారం రోజుల వ్యవధిలో నిర్వహించారు. ఈ వివాహ వేడుకకు పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రముఖ నటులు బ్రహ్మానందం, రావు రమేష్ వేడుకలో సందడి చేశారు. ఎంఎస్ నారాయణ కుమారుడు విక్రమ్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.

కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సినీ ప్రముఖుల సమక్షంలో వివాహ వేడుక ఆనందోత్సాహాల మధ్య జరిగింది. ఈ ఫొటోలు, వీడియోలు చూసిన నెటిజన్లు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఎంఎస్ నారాయణ తెలుగు సినీ పరిశ్రమలో తనదైన కామెడీ టైమింగ్, విభిన్నమైన బాడీ లాంగ్వేజ్, ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను అలరించారు. కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వందకు పైగా సినిమాల్లో నటించి గుర్తింపు పొందారు. ఆయన నటించిన ఎన్నో కామెడీ సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకులను నవ్విస్తూనే ఉన్నాయి. 2015లో ఆయన కన్నుమూశారు. ఆయనకు విక్రమ్, శశికిరణ్ అనే ఇద్దరు సంతానం ఉన్నారు.