Site icon NTV Telugu

IPL 2023 : 20వ ఓవర్ లో హైఎస్ట్ సిక్సులు కొట్టింది ఎవరో తెలుసా..!

Highest Sixes

Highest Sixes

పొట్టి క్రికెట్ అంటేనే సిక్సర్లకు పెట్టింది. అయితే ఈ ఫార్మాట్లో బ్యాటర్లు పోటీపడి మరీ సిక్సర్లు కొడతారు. దాదాపు ప్రతి మ్యాచ్ లో సిక్సర్ల సునామీ తప్పక ఉంటుంది. ఐపీఎల్ వచ్చాక బ్యాటర్లు మరింతగా రెచ్చిపోతున్నారు. ఇన్సింగ్స్ తొలి బంతా, ఆఖరి బంతా.. స్పిన్.. స్పిడ్ అనే తేడా లేకుండా ఎడాపెడా సిక్సర్లు బాదేస్తున్నారు. ఒక్కో మ్యాచ్ లో సగటున 10 నుంచి 20 సిక్సర్లు వస్తుంటారు. క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, పోలార్డ్, వార్నర్ లాంటి భారీ హిటర్లయితే ఆడింది.. 200 లోపు మ్యాచ్ లే అయినా మ్యాచ్ ల సంఖ్యకు మించి సిక్సర్లు కొట్టారు. మ్యాచ్ లో ఏదో ఒక సందర్భంలో సిక్సర్ కొట్టడం ఒకెత్తైతే ఇన్సింగ్స్ ఆఖరి ఓవర్ లో బాదడం మరో ఎత్తు.. ఆఖరి ఓవర్ అనగానే సహజంగా ఒత్తిడి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో తెగువ చూపి సిక్సర్లు బాదడం మన మహేంద్రుడికే చెల్లింది. అందుకే అతను చివరి ఓవర్ లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్ లో చరిత్రలో ఏ ఆటగాడు కూడా చివర్లో ధోని కొట్టినన్ని సిక్సర్లు కొట్టలేదు. చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఇన్సింగ్స్ చివరి ఓవర్ లో రికార్డు స్థాయిలో 57 సిక్సర్లు బాదాడు.

Read Also : land for jobs case: స్పీడ్ పెంచిన ఈడీ.. లాలూ ప్రసాద్ కుమార్తెపై ప్రశ్నలు

ధోని తర్వాత పోలార్డ్ అత్యధికంగా 33 సిక్సర్లు, రవీంద్ర జడేజా 26, హార్థిక పాండ్యా 25, రోహిత్ శర్మ 23 సిక్సర్లు కొట్టాడు. ఓవరాల్ గా ఐపీఎల్ లో అత్యధిక సిక్సర్ల రికార్డు విండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ పేరిట ఉంది. యూనివర్సల్ బాస్ 142 ఐపీఎల్ మ్యాచ్ లో 357 సిక్సర్ల బాదాడు. ఆ తర్వాత ఏబీ డివిలియర్స్ ( 251 ), రోహిత్ శర్మ ( 245 ), ధోని ( 235 ), కోహ్లీ ( 227 ) ఉన్నారు. ఇదిలా ఉంటే ఐపీఎల్-2023లో భాగంగా నిన్న ( ఏప్రిల్ 12) రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ధోని 17 బంతుల్లో 3 సిక్సర్లు, ఫోర్ సాయంతో అజేయంగా 32 పరుగులు చేసిన సీఎస్కే గెలవలేకపోయింది. ధోని, జడేజా చివరి వరకు అద్భుతంగా పోరాడినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. సందీప్ శర్మ ఆఖరి మూడు బంతులను అద్భుతంగా బౌలింగ్ చేసి ధోని, జడేజాలను కట్టడి చేశాడు. ఫలితంగా రాజస్థాన్ రాయల్స్ 3 పరుగుల తేడాతో గెలిచింది.

Read Also : Sanjay Dutt: సంజు భాయ్ బాగానే ఉన్నాడట.. కంగారు పడకండి

Exit mobile version