NTV Telugu Site icon

MS Dhoni Captain: ఐపీఎల్ ఆల్-టైమ్ జట్టుకు కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ.. రోహిత్‌కు దక్కని చోటు!

Ms Dhoni

Ms Dhoni

IPL All-Time Greatest Team Captain is MS Dhoni: భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆల్-టైమ్ గ్రేటెస్ట్ ఐపీఎల్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఐపీఎల్ టోర్నీలో 5 టైటిల్స్ అందించిన ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు కనీసం జట్టులో కూడా చోటు దక్కకపోవడం విశేషం. 15 మందితో కూడిన ఆల్-టైమ్ గ్రేటెస్ట్ జట్టును ఐపీఎల్ సెలక్షన్‌ ప్యానెల్‌ ప్రకటించింది. 2008 నుంచి ఇప్పటిదాకా ఐపీఎల్‌ టోర్నీలో ఆడిన ఆటగాళ్లతో అత్యుత్తమ జట్టును ఆదివారం ప్యానెల్‌ ప్రకటించింది.

ఐపీఎల్ ఆల్-టైమ్ గ్రేటెస్ట్ జట్టు ఎంపిక సెలక్షన్‌ ప్యానెల్‌లో మాజీ ఆటగాళ్లైన వసీం అక్రమ్, మాథ్యూ హేడెన్, టామ్ మూడీ, డేల్ స్టెయిన్‌లతో పాటు 70 మంది జర్నలిస్టులు కూడా ఉన్నారు. 2024 ఫిబ్రవరి 20 నాటికి ఐపీఎల్‌ 16 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో ఆల్-టైమ్ గ్రేటెస్ట్ ఐపీఎల్ జట్టును ప్రకటించారు. ఈ జట్టులో కొన్ని ఆశ్చర్యకరమైన ఎంపికలు ఉన్నాయి. డేవిడ్ వార్నర్‌తో పాటు ఓపెనర్‌గా విరాట్ కోహ్లీ ఎంపికయ్యాడు. క్రిస్ గేల్ మూడో స్థానంలో, సురేశ్ రైనా 4వ స్థానంకు ఎంపికయ్యాడు. ఏబీ డివిలియర్స్, సూర్యకుమార్ యాదవ్, ఎంఎస్ ధోనీలతో బ్యాటింగ్ లైనప్‌ ఉంది.

15 మందితో కూడిన జట్టులో హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, రవీంద్ర జడేజాలు ఆల్‌రౌండర్‌లుగా ఎంపికయ్యారు. రషీద్ ఖాన్, సునీల్ నరైన్, యుజ్వేంద్ర చహల్ స్పిన్ కోటాలో.. లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రాలు పేస్ కోటాలో జట్టులో చోటు దక్కించుకున్నారు. ఎంఎస్ ధోనీ కెప్టెన్, కీపర్‌గా ఎంపికయ్యాడు. స్టార్ స్పోర్ట్స్ ఇన్‌క్రెడిబుల్ 16 ఆఫ్ ఐపీఎల్’ షోలో వసీం అక్రమ్, మాథ్యూ హేడెన్, టామ్ మూడీ, డేల్ స్టెయిన్‌లు మాట్లాడుతూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

ఐపీఎల్ ఆల్-టైమ్ టీమ్:
ఎంఎస్ ధోనీ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్, సురేష్ రైనా, ఏబీ డివిలియర్స్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కీరన్ పొలార్డ్, రషీద్ ఖాన్, సునీల్ నరైన్, యుజ్వేంద్ర చహల్, లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా.