NTV Telugu Site icon

MS DHONI Movie Rerelease : ధోని బర్త్డే స్పెషల్.. దేశ వ్యాప్తంగా ధోని సినిమా రీరిలీజ్..

Msd

Msd

MS DHONI Movie Rerelease : నేడు టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోని 43 పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఎంఎస్ ధోని కి సంబంధించిన పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కొందరు వీరాభిమానులు ధోని పుట్టినరోజు సందర్భంగా వివిధ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నందిగామ పట్టణంలో ఏకంగా 100 అడుగుల కటౌట్ ఏర్పాటు చేసి మహేంద్రసింగ్ ధోని పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. అంతేకాకుండా అనేక ప్రదేశలలో ధోని ఫ్యాన్స్ కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇక నేడు ధోని పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఫ్యాన్స్ కు స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అతడిపై చిత్రీకరించిన ” ధోని అన్​టోల్డ్ స్టోరీ ” సినిమా రీ రిలీజ్ అవుతుంది.

HBD MS DHONI : 100 అడుగుల అభిమానం.. ధోని కట్ అవుట్ మాములుగా లేదుగా..

ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఇంకా అనేక రాష్ట్రాలలో ఎంపిక చేసిన థియేటర్లలో స్పెషల్ షోస్ వేస్తున్నారు. సినిమా సంబంధించి బుక్ మై షో లలో కూడా టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. 2016లో విడుదలైన ఈ సినిమా అఖండ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ధోని సినిమాకు నీరజ్ పాండే దర్శకత్వం వహించారు. ధోని తన చిన్న తనం నుండి జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకుని 2011 వరల్డ్ కప్ గెలిచేదాక అతని లైఫ్ జర్నీ కళ్ళకు కట్టినట్లుగా సినిమాలో చూపించాడు దర్శకుడు. ఈ సినిమాలో ధోని పాత్రలో బాలీవుడ్ స్టార్, దివంగత యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించాడు. ఆయన సరసన కియారా అద్వానీ, దిశ పటానీలు నటించారు.

Happy Birthday MS Dhoni: కెప్టెన్‌లలో ‘ఎంఎస్ ధోనీ’ వేరే లెవెల్.. టాప్ రికార్డ్స్ ఇవే!

Show comments