MS Dhoni Missed Stumping: చెపాక్‌లో సందడి చేసిన CSK లెజెండ్స్.. స్టంపింగ్ మిస్ చేసిన ధోనీ.. వీడియో వైరల్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni Missed Stumping: ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందే చెన్నైలోని చిదంబరం స్టేడియం (చెపాక్) అభిమానుల ఉత్సాహంతో మార్మోగింది. దీనికి కారణం చెన్నై సూపర్ కింగ్స్ అభిమానుల కోసం నిర్వహించిన ప్రత్యేక ఈవెంట్. ప్రస్తుత, మాజీ క్రికెట్ దిగ్గజాలు ఒకే వేదికపై కనిపించి అభిమానులను అలరించారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు సీఎస్కే అభిమానులు (యెల్లో ఆర్మీ) భారీగా హాజరు అయ్యారు. ఈ ఈవెంట్‌లో పాత, కొత్త ఆటగాళ్లు మైదానంలో తలపడగా.. ఒక ఆసక్తికర ఘటన అందరి దృష్టిని ఆకర్షించింది.
New ATM Rules: ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏటీఎం రూల్స్ ఛేంజ్.. పరిమితి ఎంత ఉంటుంది?
Also Read
- Uttam Kumar Reddy: "రిఫరీపైనే అనుమానం వస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం".. ఈసీ, బీజేపీపై మంత్రి ఫైర్..
- Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
- Hyderabad: హుస్సేన్ సాగర్‌లో కొనసాగుతున్న నిమజ్జనాలు.. ఈ రూట్లలో వాహనాలకు నో ఎంట్రీ!
- CM Chandrababu: ముంపు ప్రాంతాలపై సీఎం ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు.!
కొత్తగా సీఎస్కేలో చేరిన సంజు శాంసన్, శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్‌ను ఎదుర్కొన్నాడు. ఇక్కడ మరో హైలైట్ ఏమిటంటే.. వికెట్ల వెనుక లెజెండ్. మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని ఉండటం. మురళీధరన్ వేసిన కొన్ని బంతులను సంజు జాగ్రత్తగా ఆడుతుండగా.. ఓ సారి పెద్ద షాట్ కొట్టేందుకు ముందుకు వచ్చాడు. అయితే మురళీధరన్ బౌలింగ్ ను సంజు బీట్ చేయలేకపోయాడు. దీంతో ధోనీకి సులభమైన స్టంపింగ్ అవకాశం వచ్చింది. కానీ ఆశ్చర్యకరంగా ధోనీ బంతిని వికెట్లను పడగొట్టే ప్రయత్నించి మిస్ అయ్యాడు. ఆ సమయానికి పిచ్ మధ్యలో ఉన్న సంజు మల్లి తిరిగి క్రీజుకు చేరుకున్నాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ తర్వాత సంజు తిరిగి తన ఫామ్ ను రుచి చూపించాడు. మురళీధరన్ వేసిన బంతిని భారీ సిక్సర్ కొట్టి స్టేడియాన్ని కేకలతో మార్మోగించాడు.
Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!
గత సీజన్ లో సీఎస్కే పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచినా.. ఈసారి మినీ వేలంలో బలమైన జట్టును కలిగి ఉంది. రాజస్థాన్ రాయల్ sతో గువాహటిలో జరగనున్న మొదటి మ్యాచ్‌తో ఐపీఎల్ 2026 ప్రయాణాన్ని ప్రారంభించబోతోంది.
విజిల్ పోడు.. @ChennaiIPL @msdhoni @IamSanjuSamson @IPL
Dhoni Stumping miss..😍#CSK #IPL2026 #IPL #MSDHIONI #Sanjusamson pic.twitter.com/4yqDeaYzR7— Ram kumar (@RAESC2828) March 23, 2026
తాజావార్తలు
-
Uttam Kumar Reddy: “రిఫరీపైనే అనుమానం వస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం”.. ఈసీ, బీజేపీపై మంత్రి ఫైర్..
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Asian Games Marathon: 44 ఏళ్ల నిరీక్షణకు తెర.. మారథాన్‌లో భారత్‌కు సావన్ బర్వాల్ రజతం
-
Hyderabad: హుస్సేన్ సాగర్‌లో కొనసాగుతున్న నిమజ్జనాలు.. ఈ రూట్లలో వాహనాలకు నో ఎంట్రీ!
-
CM Chandrababu: ముంపు ప్రాంతాలపై సీఎం ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు.!
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!