MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) హీరో మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) ఆటకు పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ (Pervez Musharraf) కూడా ఫిదా అయ్యారట. ఈ విషయాన్ఇన తాజాగా బీసీసీఐ (BCCI) వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా (Rajiv Shukla) గుర్తుచేసుకున్నారు. 2006లో భారత జట్టు పాకిస్థాన్ పర్యటనకు వెళ్లినప్పుడు లాహోర్‌లో జరిగిన మూడో వన్డేలో ధోనీ మెరుపు ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను గెలిపించాడు. ఆ మ్యాచ్ తర్వాత ముషారఫ్ స్వయంగా ధోనీ బ్యాటింగ్, పొడవాటి జుట్టును (Hairstyle) మెచ్చుకుంటూ.. “నీ హెయిర్ కట్ చేసుకోవద్దు, నీకు ఈ స్టైల్ బాగుంది” అని చెప్పిన విషయాన్ని శుక్లా తాజాగా పంచుకున్నారు. తన అద్భుతమైన ఆటతీరుతో అప్పట్లోనే ధోనీ అంతటి క్రేజ్ సంపాదించుకున్నాడని కొనియాడారు.
19 ఏళ్ల సుదీర్ఘ ఐపీఎల్ (IPL) ప్రయాణానికి ధోనీ మంగళవారం వీడ్కోలు పలికిన (IPL Retirement) విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ.. ధోనీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆట విషయంలో ధోనీ చాలా నిజాయితీగా ఉంటారని, తాను 100 శాతం ఫిట్‌గా ఉండి పూర్తిస్థాయిలో ఆడగలనని అనుకుంటేనే మైదానంలోకి దిగుతారని శుక్లా అన్నారు. ఒకవేళ తాను 99 శాతం మాత్రమే ఫిట్‌గా ఉన్నా.. ఎవరూ చెప్పకుండానే స్వచ్ఛందంగా తప్పుకునే వ్యక్తిత్వం ధోనీదని ఆయన వివరించారు. ఎంతో ఆలోచించే ధోనీ ఈ నిర్ణయం తీసుకున్నారని, క్రికెట్‌కు ధోనీ చేసిన సేవలను ఎప్పటికీ మరువలేమని, కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన రిటైర్మెంట్ నిర్ణయాన్ని గౌరవించాలని శుక్లా కోరారు.
ఇక, 2007లో ధోనీని భారత జట్టు కెప్టెన్‌గా (Indian Cricket Team Captain) ఎంపిక చేసినప్పటి రోజులను కూడా రాజీవ్ శుక్లా గుర్తుచేసుకున్నారు. అప్పట్లో సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) కెప్టెన్సీ బాధ్యతలను వద్దనడంతో ఆ అవకాశం ధోనీకి దక్కిందని తెలిపారు. మొదట్లో ధోనీ నాయకత్వంపై చాలామందికి సందేహాలు ఉండేవని, కానీ క్లిష్ట పరిస్థితుల్లోనూ మ్యాచ్‌లను గెలిపిస్తూ తన విమర్శకుల నోళ్లు మూయించాడని శుక్లా అన్నారు. ఓడిపోయే మ్యాచ్‌లను కూడా గెలిపించడం ధోనీ ప్రత్యేకత అని పేర్కొన్నారు. తమిళనాడులో అభిమానులు ధోనీని ముద్దుగా ‘తలా’ (Thala) అని పిలుచుకుంటారని, కానీ ఆయనకు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ (Fan Following) ఉందని శుక్లా చెప్పారు. ఇకపై ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టుకు మెంటార్‌గా (Team Mentor) వ్యవహరించడం జట్టుకు ఎంతో మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు.

