Site icon NTV Telugu

Velammal Cricket Stadium: అంతర్జాతీయ ప్రమాణాలతో మదురైలో క్రికెట్ స్టేడియంను ప్రారంభించిన ధోని!

Ms Dhoni

Ms Dhoni

Velammal Cricket Stadium: తమిళనాడులో రెండో అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా వేలమ్మాళ్ క్రికెట్ స్టేడియాన్ని ప్రారంభించారు మహేందర్ సింగ్ ధోని. ముంబై నుంచి ఓ ప్రైవేట్ విమానంలో మధురై చేరుకున్న ధోనిని చూసేందుకు అభిమానులు తెల్లవారుజాము నుంచే విమానాశ్రయం వద్ద భారీగా గుమిగూడారు. వేలమ్మాళ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (TNCA) సహకారంతో నిర్మించిన ఈ అంతర్జాతీయ స్థాయి స్టేడియం కోసం రూ. 300 కోట్లకు పైగా ఖర్చు చేశారు. 12.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ స్టేడియం, ప్రాంతీయ క్రికెట్ కేంద్రంగా మారనుంది. ప్రస్తుతం దీని సీటింగ్ సామర్థ్యం 7,300 కాగా, భవిష్యత్తులో దీనిని 20,000కు పెంచే ప్రణాళికలు ఉన్నాయి.

SS Rajamouli: నేడు దర్శకధీరుడు రాజమౌళి పుట్టిన రోజు.. సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ

ఇక స్టేడియం ప్రత్యేకతల విషయానికి వస్తే.. ప్రపంచ స్థాయి క్రికెట్ మైదానంలో ఉండాల్సిన సౌకర్యాలను పొందుపరిచారు. ఇందులో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పిచ్, LED ఫ్లడ్‌లైట్లు, ఆధునిక ప్లేయర్ డ్రెస్సింగ్ రూమ్‌లు, డిజిటల్ స్కోర్‌బోర్డు, ప్రాక్టీస్ నెట్‌లు, జిమ్నాసియం, మీడియా, VIP గ్యాలరీలు ఇలా అన్నిటిని పొందుపరిచారు. ఇక విమానాశ్రయంలో దిగిన తర్వాత, ధోని తన ఐకానిక్ జెర్సీ నంబర్ ‘7’ ఉన్న తెల్లటి కారులో స్టేడియంకు చేరుకున్నారు. భారీ జన సందోహాన్ని నియంత్రించడానికి పెద్దెత్తున పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవం తర్వాత గ్రౌండ్ లో కొద్దిసేపు బ్యాటింగ్ చేసి అభిమానులను అలరించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఆ తర్వాత ధోని మళ్లీ ‘7’ నంబర్ ఉన్న నీలిరంగు కారులో విమానాశ్రయానికి వెళ్లి, ప్రైవేట్ చార్టర్‌లో ముంబైకి తిరిగి వెళ్లారు.

Weather Updates: తెలుగు రాష్ట్రాలకు వాన గండం.. భారీ వర్షాలపై హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ

ఇటీవలే ధోని తన డ్రోన్ పైలట్ శిక్షణను పూర్తి చేసి కొత్త ఘనతను సాధించారు. భారతదేశంలో ప్రముఖ డ్రోన్ తయారీదారు, DGCA ఆమోదించిన రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ (RPTO) అయిన గరుడ ఏరోస్పేస్ (చెన్నై) నుండి ఆయన ఈ శిక్షణ పొందారు. ధోని ఆ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఆ కఠినమైన శిక్షణా కార్యక్రమాన్ని పూర్తి చేసిన తర్వాత, ధోని ఇప్పుడు డ్రోన్‌లను నడపడానికి సర్టిఫికేషన్ పొందారు. తరగతులు, ప్రాక్టికల్ ఫ్లయింగ్ సెషన్‌లతో కూడిన ఈ శిక్షణ దేశంలో సురక్షితమైన డ్రోన్ ఆపరేషన్లను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

Exit mobile version