Site icon NTV Telugu

MS Dhoni: ఎంతో కష్టంగా ఉన్నా.. నా అభిమానుల కోసమే ఇదంతా: ధోనీ

Ms Dhoni New Hairstyle

Ms Dhoni New Hairstyle

MS Dhoni Maintaining New Hairstyle for Fans Only: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ హెయిర్‌స్టైల్స్‌ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మహీ ఎప్పుడూ డిఫరెంట్‌ హెయిర్‌ స్టైల్స్‌తో అభిమానులను ఖుషీ చేస్తుంటాడు. మహీ తన కెరీర్‌లో ఎన్నో రకరకాల హెయిర్‌స్టైల్స్‌ మెయింటైన్ చేస్తూ ట్రెండ్‌ సెట్టర్‌గా మారాడు. ధోనీ ఎన్ని హెయిర్‌స్టైల్స్‌ మార్చినా.. కెరీర్ ఆరంభంలో టార్జన్ త‌ర‌హా హెయిర్‌స్టైల్‌ను ఇప్పటికీ ఎవరూ మర్చిపోరు. మ‌ళ్లీ ఇప్పుడు దాదాపుగా అలాంటి హెయిర్‌స్టైల్‌తో ద‌ర్శన‌మిస్తున్నాడు. ఓ యాడ్ షూట్ కోసం ధోనీ ఈ హెయిర్‌స్టైల్‌ మెయింటైన్ చేస్తున్నాడు. తాజాగా ఈ హెయిర్‌స్టైల్‌పై స్పందించాడు.

తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఎస్ ధోనీ.. తన కొత్త హెయిర్‌స్టైల్‌ను మెయింటైన్ చేయడం చాలా కష్టంగా ఉందన్నాడు. తన అభిమానులకు ఈ హెయిర్‌స్టైల్‌ నచ్చడంతోనే.. మరికొంతకాలం ఈ స్టైల్‌లోనే ఉండేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు. ‘నేను గతంలో యాడ్‌ షూట్ కోసం వెళ్లినప్పుడు నా హెయిర్ స్టైల్‌, మేకప్‌ కోసం 20 నిమిషాల సమయం పట్టేది. ఇప్పుడు గంటకు పైనే పడుతోంది. హెయిర్‌స్టైల్‌ కోసం గంటల పాటు అలానే కూర్చుని సిద్ధం కావడం నాకు బోరింగ్‌ అనిపిస్తోంది. అయితే నా అభిమానులు మాత్రం ఈ హెయిర్‌స్టైల్‌ బాగా ఇష్టపడుతున్నారు. చాలా బాగుందదంటున్నారు. ఈ హెయిర్‌స్టైల్‌ కొనసాగించడం చాలా కష్టం. అయినా సరే నా అభిమానుల కోసం మరికొంతకాలం ఇలానే ఉండేందుకు ప్రయత్నిస్తా. ఏదో ఒక రోజు మాత్రం ఈ హెయిర్‌స్టైల్‌ మారుస్తా’ అని ధోనీ చెప్పాడు.

Also Read: Mohammed Shami: ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఏం పొరపాటు చేశామో ఇప్పటికీ అర్థం కావడం లేదు!

అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై మూడు ఏళ్లు గడుస్తున్నా.. ఎంఎస్ ధోనీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకున్నా.. ఐపీఎల్‌లో ఆడుతూ అభిమానులను అలరిస్తున్నాడు. తన నాయకత్వంలో 2023లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును మరోసారి విజేతగా నిలిపాడు. 42 ఏళ్ల ధోనీ.. ఈ ఏడాది మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహీ సాధన చేస్తున్నాడు. ఐపీఎల్‌ 2024లో చెన్నై సారథిగా ధోనీనే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Exit mobile version