NTV Telugu Site icon

MS Dhoni E-Cycle: కొత్త ఈ-సైకిల్​ తో హల్చల్ చేస్తున్న ధోనీ.. మరి ఆ ఈ-సైకిల్ విశేషాలేంటంటే..?!

6

6

టీమిండియా మాజీ క్రికెటర్ ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుడైన మహేంద్ర సింగ్ ధోనీకి బైక్స్ పై ఉన్న ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు ఉన్న వాహనాలకు ఓ పెద్ద షోరూం ఓపెన్ చేయొచ్చు అంటే నమ్మండి. అతడికి ఉన్న గ్యారేజీలో ఎన్నో రకాల బైకులు, కార్లు ఉన్నాయి. ఇకపోతే తాజాగా ఈయన ఓ ఈ – సైకిల్ ను కొత్తగా కొన్నాడు. ఇక ఈ – సైకిల్ గురించి వివరాలు చూస్తే..

Also read: CM Yogi : ఆ కారణంగా సీఎం యోగి బులంద్‌షహర్-నోయిడా పర్యటన రద్దు?

తాజాగా ఈ సైకిల్ ను ధోని హెల్మెట్ ధరించి నడుపుతున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సైకిల్ ఫోల్డబుల్ సైకిల్. కాబట్టి ఈ సైకిల్ ఎక్కడి కావాలంటే అక్కడికి అక్కడికి సౌకర్యవంతంగా తీసుకోవడానికి వీలుంటుంది. ఇక ఈ సైకిల్ గంటకు 25 కి.మీ గరిష్ట వేగాన్ని అందుకోగలుగుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించే.. ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ ఉపయోగించి ఈ ఈఎం డూడుల్​ వీ3 లో 12.75 mah బ్యాటరీ ఉంటుంది. ప్రస్తుతం దీని ధర రూ. 52,999 ధరకు లభిస్తుంది. ఇక ఈ సైకిల్ లో 20 ఇంచ్​ స్పోక్డ్ వీల్స్, 16 ఇంచ్​ అల్యూమినియం అలాయ్ ఫ్రేమ్, ఫ్యాట్ టైర్లు ఇందులో ఉన్నాయి.

Also read:Saudi Arabia : శత్రు దేశం కోసం ఖజానాను తెరిచిన సౌదీ అరేబియా.. వేలాది మందికి సహాయం

ఇక కార్లు, బైక్ల దగ్గరే ధోనీ ప్రేమ ఆగిపోకుండా.. ఆయన గతంలో ట్రాక్టర్ నడుపుతూ కూడా కనిపించాడు. ఇప్పుడు మళ్లీ ఈ – బైక్ ఉపయోగించడంతో ఇప్పుడు అందరి ద్రుష్టి ఈ సైకిల్ ఫై పడింది. ప్రస్తుతం ఐపీఎల్ 2024 సీజన్​లో సీఎస్​కే తో కలిసి ఆడుతున్నాడు ధోనీ. ఇక ఈ సీజన్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తే ఐపీఎల్ లో ధోనీకి ఇదే చివరి ఏడాది కావచ్చు.