ఐపీఎల్ 2023 సీజన్ మ్యాచ్ లు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. ఒకరుకుమించి ఒకరుకి మించి ఒకరు నువ్వా నేనా అన్నట్లు బౌలింగ్, బ్యాటింగ్ లో పోటీ పడుతున్నారు. చివరి వరకు మ్యాచ్ లు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. బుధవారం జరిగిన చెన్నై సూపర్ కింగ్స్- రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో చివరి బంికి ధోని సేన ఓటమి పాలైంది. లాస్ట్ బంతికి ఐదు పరుగులు చేయాల్సిన టైంలో ధోని సిక్స్ కొట్టడంలో విఫలమయ్యాడు. చివరి బాల్ కు ఆర్ఆర్ జట్టు విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో ధోని మోకాలి నొప్పితో ఇబ్బంది పడ్డాడు. కీపింగ్ చేసే సమయంలో, బ్యాటింగ్ చేసే సమయంలో నొప్పితో ఇబ్బంది పడినట్లు కనిపించింది.
Read Also : JC Prabhakar Reddy Emotional: జేసీ ప్రభాకర్ రెడ్డి కంటతడి..!
ఐపీఎల్ ప్రారంభం నుంచి మహేంద్ర సింగ్ ధోని మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. తాజాగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో మ్యాచ్ సమయంలో ఆ గాయం ధోనిని ఇబ్బంది పెట్టినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ధోనికి 41 సంవత్సరాలు.. ఐపీఎల్ నుంచి సైతం ధోని తప్పుకోవాలని అనుకున్నాడు.. కానీ ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్ గా బాధ్యతులు నిర్వహిస్తున్నాడు. ధోని గాయం కారణంగా వచ్చే మ్యాచ్ లో ఆడేది అనుమానంగానే ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ 2023 సీజన్ లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్ లు ఆడింది. రెండు మ్యాచ్ లలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఐదవ స్థానంలో నిలిచింది. సీఎస్కే జట్టు తదుపరి మ్యాచ్ ఈ నెల 17న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడనుంది. అయితే.. ధోని మోకాలి గాయంతో ఇబ్బంది పడుతున్న కారణంగా ఆ మ్యాచ్ లో ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే రెండు మూడు మ్యాచ్ ల వరకు ధోని విశ్రాంతి తీసుకుంటాడన్న వార్తలు కూడా వస్తున్నాయి.
Read Also : Cheating in love: మాజీ ప్రేయసి ఇంట్లో ప్రియుడు రచ్చ.. అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక దాడి
ధోని మోకాలి గాయంపై సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించారు. ధోని గాయం పెద్దదేమి కాదని.. అతను కోలుకొని జట్టును నడిపంచగలడనే విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లేయర్లు గాయాల భారినపడుతున్నారు. ఇప్పటికే దీపక్ చాహర్, ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ లతో పాటు సిమ్రన్ జీత్ సింగ్, ముకేశ్ చౌదరీలు గాయపడడంతో ఇప్పటికే వీరి సేవలను చెన్నై కోల్పోయింది. తాజాగా పేసర్ సిసాండా మగాలా చేతికి గాయం కావడంతో రెండు వారాలు టోర్నోకి దూరమయ్యాడు. ప్రస్తుతం ధోని కూడా మోకాలి గాయంలో బాధపడుతుండడంతో పాటు వచ్చే రెండు మూడు మ్యాచ్ లకు ఆడే అవకాశాలు తక్కువగా ఉండటంతో సీఎస్కేకు గట్టి ఎదురుదెబ్బేనని చెప్పొచ్చు..