NTV Telugu Site icon

MS Dhoni: అయ్యబాబోయ్.. ధోని ఓ రేంజ్ లో అభిమానులను ప్రాంక్ చేసేసాడుగా..!

2

2

మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరు గురించి ప్రపంచంకి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. భారత్ లో ఈ పెరంటే క్రికెట్ అభిమానులకు ఓ ఎమోషన్. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2024లో ధోనిని చూసేందుకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎక్కడ మ్యాచ్ ఆడితే అక్కడి స్టేడియాలకు క్రికెట్ లవర్స్ ఎగబడి పోతున్నారు. దీనికి కారణం లేకపోలేదు ధోని ఆడే చివరి సిరీస్ ఇది అన్నట్లుగా పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి. పెద్ద ఎత్తున మహేంద్ర సింగ్ ధోని అభిమానులు స్టేడియం కు వచ్చి అతనిని సపోర్ట్ చేస్తున్నారు. తాజాగా జరిగిన మ్యాచ్ లో చెన్నై వేదికగా కోల్కత్తా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ విషయం స్పష్టంగా కనపడింది. అయితే ఈ విషయంలో ధోని కాస్త డిఫరెంట్ గా ఆలోచించి వచ్చిన ప్రేక్షకులకు మైండ్ బ్లాక్ అయ్యేలా ఓ ప్రాంక్ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సోమవారం నాడు జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాకపోతే మ్యాచ్ చివరి లో 17 ఓవర్ లో చెన్నై సూపర్ కింగ్స్ శివం దుబే వికెట్ కోల్పోయింది. వికెట్ పడిపోవడంతో స్టేడియం ఒక్కసారిగా దద్దరిల్లింది. దానికి కారణం మహేంద్రసింగ్ ధోని. ధోని నినాదాలతో గ్రౌండ్ మార్మోగింది. కాకపోతే డ్రెస్సింగ్ రూమ్ నుండి ముందుగా రవీంద్ర బయటకు వచ్చి బ్యాటింగ్ వెళ్లేలా కనిపించాడు. దాంతో అభిమానులు కాస్త నిరాశ పడ్డారు. కాకపోతే అప్పుడే అసలైన ట్విస్ట్ మొదలయింది. ఆ సమయంలో జడేజా బ్యాటింగ్ కు వస్తున్నట్టే వచ్చి మళ్లీ యుటర్న్ తీసుకొని లోపలికి వెళ్ళాడు. దాంతో ఆ సమయంలో స్టేడియంలో ఉన్న ప్రేక్షకులకు అసలు ఏం జరుగుతుందోన్న సంగతి అర్థం అవలేదు. మరో క్షణంలో డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న మహేందర్ సింగ్ ధోని హెల్మెట్ పెట్టుకుని బ్యాట్ తీసుకోని డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చాడు. ఇకఅంతే.. ధోని అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. దాంతో మరోసారి స్టేడియం మొత్తం ధోని నినాదాలతో మారు మోగింది.

ప్రస్తుతం ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. కాకపోతే ఈ విషయంపై మొదట జడేజా ప్రాంక్ చేశాడని అందరూ భావించిన.. కానీ., అది ధోని ప్లాన్ అని స్వయంగా జడ్జి అని తెలిపారు. చెపాక్ స్టేడియంలో ప్రేక్షకులకు జలక్ ఇవ్వాలని ధోని అనుకున్నట్లు అందులో భాగంగా వారికి పైసా వసూల్ ఎంటర్టైన్మెంట్ లభించడానికి ధోని ఇలా భావించాడని రవీంద్ర జడేజా చెప్పుకొచ్చాడు.