NTV Telugu Site icon

MS Dhoni Catch: 42 ఏళ్ల వ‌య‌స్సులో ఎంఎస్ ధోనీ క‌ళ్లు చెదిరే క్యాచ్‌.. వీడియో వైర‌ల్‌!

Ms Dhoni Catch

Ms Dhoni Catch

MS Dhoni’s Catch Vdieo Goes Viral: చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అద్భుత వికెట్ కీపింగ్‌తో ఆకట్టుకున్నాడు. 42 ఏళ్ల వ‌య‌స్సులో కూడా కుర్రాడిలా డైవ్ చేసి స్టన్నింగ్ క్యాచ్‌ అందుకున్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం రాత్రి గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మహీ స్టన్నింగ్ క్యాచ్‌ పట్టాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది.

Also Read: SRH vs MI: ముంబైతో సన్‌రైజర్స్‌ ఢీ.. ఉప్పల్‌లో బోణీ కొట్టేదెవరో!

గుజరాత్ టైటాన్స్‌ ఇన్నింగ్స్ సందర్భంగా 8వ ఓవర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ డారిల్ మిచెల్ వేశాడు. ఈ ఓవర్లోని మూడో బంతిని డారిల్ ఆఫ్ స్టంప్ దిశగా బంతిని సాధించగా.. విజయ్ శంకర్ కవర్ డ్రైవ్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి స్లిప్ వైపు దూసుకెళ్లింది. కీపర్ ఎంఎస్ ధోనీ సూపర్ డైవ్‌తో బంతిని అందుకున్నాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అయింది. ధోనీపై ఫ్యాన్స్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 42 ఏళ్ల వయసులో కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు, వాటే క్యాచ్, ధోనీ గ్రేట్, ధోనీని మించిన కీపర్ లేడు అని కామెంట్స్ చేస్తున్నారు.

Show comments