MS Dhoni: ఎంఎస్ ధోనీపై పరువు నష్టం దావా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Defamation Case Filed Against MS Dhoni: క్రికెట్ అకాడమీ విషయంలో మాజీ వ్యాపార భాగస్వాములు తనను రూ. 15 కోట్ల మేర మోసం చేశారంటూ టీంఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్కా స్పోర్ట్స్ డైరెక్టర్స్ మిహిర్ దివాకర్, సౌమ్య దాస్‌లు తాజాగా మహీపై పరువు నష్టం దావా వేశారు. తమపై తప్పుడు ఆరోపణలు చేశారని, తమ పరువుకు భంగం వాటిల్లినందుకు ధోనీ నష్టపరిహారం చెల్లించాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమపై అవాస్తవాలను ప్రచారం చేయకుండా.. సోషల్ మీడియా, మీడియా సంస్థలను నిలువరించాలని కోరారు. దివాకర్, సౌమ్యల అభ్యర్థనపై హైకోర్టు జనవరి 18న విచారణ జరపనుంది.
ఆర్కా స్పోర్ట్స్ అండ్ మేనేజ్మెంట్ లిమిటెడ్ సంస్థ 2017లో ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేసేందుకు ఎంఎస్ ధోనీతో ఒప్పందం చేసుకుంది. ఒప్పందం ప్రకారం… ఫ్రాంఛైజీ ఫీజు, లాభాల్లోని వాటాను ధోనీకి చెల్లించాల్సి ఉంటుంది. అయితే షరతులను పాటించడంలో కంపెనీ విఫలమవడంతో ధోనీ వైదొలిగాడు. ఆపై తనకు రావాల్సిన చెల్లింపులపై కోర్టును ఆశ్రయించాడు. కంపెనీ డైరెక్టర్స్ మిహిర్ దివాకర్, ఆయన భార్య సౌమ్య దాస్‌పై క్రిమినల్ కేసు దాఖలు చేశారు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
Also Read: Finn Allen Century: ఫిన్ అలెన్ ఊచకోత.. 16 సిక్స్‌లతో సెంచరీ! ప్రపంచ రికార్డు సమం
ఈ విషయాన్ని ఇటీవల టీంఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తరఫు న్యాయవాది మీడియాకు తెలిపారు. ఆర్కా స్పోర్ట్స్ చేసిన మోసం కారణంగా ధోనీ రూ.15 కోట్ల మేర నష్టపోయాడని తెలిపారు. ఈ ఆరోపణలన్నీ అవాస్తవమని తాజాగా దివాకర్ కొట్టిపారేశారు. కేసు కోర్టులో ఉండగానే ధోనీ తరఫు న్యాయవాది ప్రెస్‌మీట్ పెట్టడాన్ని తప్పుబట్టారు. ధోనీ తమ ప్రతిష్ఠను దెబ్బతీశారంటూ పరువు నష్టం దావా వేశారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!