MS Dhoni: ప్లేయర్ కాస్త కోచ్.? చెన్నై సూపర్ కింగ్స్‌కు కోచ్‌గా మిస్టర్ కూల్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) జట్టు ఐపీఎల్ 2026 సీజన్లో నిరాశాజనక ప్రదర్శన చేయడంతో ఫ్రాంచైజీ భవిష్యత్తుపై పెద్ద ఎత్తున చర్చలు అప్పుడే మొదలయ్యాయి. ముఖ్యంగా జట్టు భవిష్యత్ హెడ్ కోచ్‌గా MS ధోని బాధ్యతలు చేపట్టే అవకాశాలపై సోషల్ మీడియాలో పెద్దెత్తున ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీనికి కారణం మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలే కారణంగా మారాయి.
ఈ సీజన్లో రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ 14 లీగ్ మ్యాచ్‌లలో కేవలం ఆరు విజయాలు మాత్రమే నమోదు చేసింది. చివరి మూడు మ్యాచ్ లలో వరుస పరాజయాలు ఎదుర్కొన్న సీఎస్కే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. జట్టు దారుణ ప్రదర్శనతో ప్రస్తుతం హెడ్ కోచ్‌గా ఉన్న స్టీఫెన్ ఫ్లెమింగ్ పై ఒత్తిడి పెరిగింది. తాజాగా తన భవిష్యత్తుపై స్పందించిన ఫ్లెమింగ్.. కోచ్‌లను ఫలితాల ఆధారంగానే అంచనా వేస్తారని, తన పదవిపై తుది నిర్ణయం జట్టు యాజమాన్యమే తీసుకుంటుందని వ్యాఖ్యానించారు.
Also Read
అయితే ధోనితో కలిసి సీఎస్కేకు ఎన్నో ఐపీఎల్ టైటిళ్లు అందించిన ఫ్లెమింగ్, ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కోచ్‌లలో ఒకరిగా గుర్తింపు పొందారు. అయినప్పటికీ ఈ సీజన్ వైఫల్యం తర్వాత జట్టులో మార్పులపై చర్చలు జోరందుకున్నాయి. ఈ చర్చలకు మరింత ఊతమిచ్చింది అశ్విన్ చేసిన కామెంట్. సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ఓ అభిమాని సరదాగా.. “అశ్విన్ సీఎస్కే కోచ్ అయితే మ్యాచ్‌కు ముందే తన యూట్యూబ్ ఛానెల్లో ప్లేయింగ్ XI, వ్యూహాలు బయటపెడతాడు” అని కామెంట్ చేశాడు. దీనికి స్పందించిన అశ్విన్.. “ప్రత్యర్థి జట్టుకే బ్యాటింగ్, బౌలింగ్ ప్లాన్స్ కూడా చెప్పేస్తాను” అంటూ చమత్కరించారు. అయితే చివర్లో చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు వైరల్‌గా మారింది.
“ధోని ఉన్నప్పుడు ఇంకెవరిని ఎందుకు వెతుకుతున్నారు?” అంటూ అశ్విన్ చేసిన వ్యాఖ్యతో ధోని భవిష్యత్తులో సీఎస్కే హెడ్ కోచ్‌గా మారే అవకాశాలపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఐపీఎల్ 2026 సీజన్లో కాలి గాయం, బొటనవేలు సమస్యల కారణంగా ధోని ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోయినా, జట్టుతో ఎప్పటికప్పుడు మమేకమై ఉన్నాడు. అతని వ్యూహాత్మక ఆలోచన, ఒత్తిడిలో ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకునే తీరు, నాయకత్వ లక్షణాలు సీఎస్కేకు కొత్త యుగంలో కూడా ఉపయోగపడతాయని నిపుణులు భావిస్తున్నారు.
అంతేకాదు సీఎస్కేతో ధోనికి ఉన్న అనుబంధం కూడా అతడిని కోచ్ పాత్రకు సరైన ఎంపికగా కనిపిస్తుంది. జట్టు సంస్కృతి, ఫ్రాంచైజీ తత్వం, ఆటగాళ్లను నిర్వహించే విధానం వంటి అంశాలపై ధోనికి పూర్తి అవగాహన ఉంది. దీంతో భవిష్యత్తులో ధోని కోచ్‌గా వస్తే సీఎస్కే గుర్తింపును అలాగే కొనసాగించగలడని కొందరు అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Water Crisis: హైదరాబాద్ కు తాగునీటి ముప్పు..!
-
SIR Notice: ఎల్కే అద్వానీకి SIR నోటీసులు..
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!