NTV Telugu Site icon

IPL 2025 MS Dhoni: మొదలైన ఐపీఎల్ సందడి.. చెన్నైలో అడుగుపెట్టిన మిస్టర్ కూల్

Dhoni

Dhoni

IPL 2025 MS Dhoni: మహేంద్రసింగ్ ధోనీ (MS Dhoni) భారత క్రికెట్ లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరుగా గుర్తింపు పొందాడు. “కూల్ కెప్టెన్” గా పేరుగాంచిన ధోనీ తన అద్భుతమైన నాయకత్వంతో భారత జట్టుకు 2007 టి20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీని అందించాడు. అంతేకాకుండా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టును ఐదుసార్లు విజేతగా నిలిపాడు. ధోనీ బౌలర్లను సమర్థంగా మేనేజ్ చేయడంలోనూ, కీలక సమయాల్లో మ్యాచ్ ను మార్చే సత్తా కలిగిన ఆటగాడిగా ఉండటంలోనూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. క్రికెట్ లో అతని తెలివితేటలు, స్టంపింగ్ స్పీడ్, ఆటలో కూల్ మైండ్ సెట్ గురించి చెప్పుకుంటూ ఉండగానే.. ఇప్పుడు 2025 ఐపీఎల్ కోసం మహీ మళ్లీ సిద్ధమవుతున్నాడు.

Read Also: Chitti Fraud: చిట్టిల పేరుతో కుచ్చుటోపి.. ఏకంగా 500 మందిని మోసం చేసిన పుల్లయ్య..

ధోనీ ఐపీఎల్ 2025 కోసం సన్నద్ధమయ్యాడు. తాజాగా అతడు సీఎస్కే హోం టౌన్ చెన్నైకి చేరుకున్నాడు. దీంతో అతడికి చెన్నై విమానాశ్రయంలో అభిమానులు ఘన స్వాగతం అందించారు. సీఎస్కే అధికారిక సోషల్ మీడియా పేజ్ లో ధోనీ చెన్నై చేరుకున్న ఫోటోలను, వీడియోలను షేర్ చేసింది. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో, కళ్లజోడు పెట్టుకుని ఎంతో కూల్ గా నడుస్తున్న మహీ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎప్పటిలాగే మహీ తన సింప్లిసిటీతో అభిమానులను ఆకట్టుకున్నాడు.

చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు త్వరలోనే ఐపీఎల్ కోసం ట్రైనింగ్ క్యాంప్ ను ప్రారంభించనుంది. ఇందులో పాల్గొనేందుకు ధోనీ చెన్నై చేరుకున్నాడు. మహీతో పాటు మరోకొంత మంది ఆటగాళ్లు కూడా ఈ క్యాంప్ లో ప్రాక్టీస్ చేయనున్నారు. చెన్నైకు చేరుకున్న ధోనీకి జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్వాగతం పలికాడు. ఇద్దరూ కౌగిలించుకుని కాసేపు ముచ్చటించుకున్నారు. ధోనీ తన అనుభవాన్ని యువ ఆటగాళ్లకు పంచుతాడన్న నమ్మకంతో సీఎస్కే అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు.

Read Also: KTR: రేవంత్‌రెడ్డి ధన దాహం వల్లే.. ప్రమాదంలో 8 మంది కార్మికుల ప్రాణాలు!

2025 ఐపీఎల్ సీజన్ మార్చి 22న ప్రారంభం కానుంది. చెన్నై సూపర్ కింగ్స్ తన తొలి మ్యాచ్‌ను మార్చి 23న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ముంబయి ఇండియన్స్ తో తలపడనుంది. ఈ సారి ధోనీ కేవలం మెంటార్ రోల్ లో ఉండగా, రుతురాజ్ గైక్వాడ్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఐపీఎల్ లో ఐదు ట్రోఫీలను గెలుచుకున్న సీఎస్కే, ఈసారి కూడా టైటిల్ గెలవాలని పట్టుదలతో ఉంది. ధోనీ ప్రత్యేకంగా తక్కువ బరువున్న బ్యాట్లను తయారు చేయించుకున్నాడు. ధోనీ ఐపీఎల్ ను వీడినా, సీఎస్కే అభిమానుల మనసుల్లో అతను ఎప్పటికీ అలా నిలిచిపోతాడు. అతని నాయకత్వంలో జట్టు విజయాలను సొంతం చేసుకున్న తీరును చూసి ఇప్పటికీ కొత్త ఆటగాళ్లు స్పూర్తి పొందుతున్నారు. ఇక ధోనీ 2025 సీజన్ లో ఎంతవరకు తన మేజిక్ కొనసాగిస్తాడో చూడాలి. సీఎస్కే అభిమానులు మాత్రం ఇప్పటి నుంచే మళ్లీ “ధోనీ.. ధోనీ” అంటూ స్టేడియంని హోరెత్తించేందుకు సిద్ధమవుతున్నారు.