Mrunal Thakur: వారి కారణంగా నేను ఏడవని రాత్రి లేదు..
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తన నటనతో, అందంతో మంత్రముగ్ధులను చేస్తున్న నటి మృణాల్ ఠాకూర్. బయటకు ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించే ఈ ‘సీతమ్మ’.. కెరీర్ ప్రారంభంలో, వ్యక్తిగత జీవితంలో బాడీ షేమింగ్ వల్ల తీవ్రమైన మానసిక వేదనను అనుభవించానని వెల్లడించింది. శరీర బరువు కారణంగా నెటిజన్లే కాకుండా, తన చుట్టూ ఉన్నవారు కూడా తనను ఎగతాళి చేసేవారని, ఆ సమయంలో తాను ఎదుర్కొన్న ఒత్తిడి గురించి మృణాల్ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మనసు విప్పింది.
Also Read : The Paradise: నాని కోసం రూల్స్ బ్రేక్ చేశాను.. శ్రీకాంత్ ఓదెల ఎమోషనల్ ట్వీట్!
Also Read
- House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
- Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
- Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
- IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
మృణాల్ మాట్లాడుతూ.. ‘శరీర బరువు వల్ల వచ్చిన ట్రోల్స్ చూసి ఏడుస్తూ నిద్రపోయి.. ఉబ్బిన కళ్లతో నిద్రలేచిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఆ మాటలు నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయి. కానీ, ఒకరోజు జిమ్లో ఒక సన్నటి అమ్మాయి నా దగ్గరకు వచ్చి ‘నేను మీలాగా మారాలంటే ఏం చేయాలి?’ అని అడగింది.. అప్పుడు నాకు అర్థమైంది.. మనం ఎలా ఉన్నా మనల్ని ఇష్టపడేవారు ఉంటారని. మనల్ని మనం గౌరవించుకోవడం మొదలుపెడితేనే ఇతరులు మనకు విలువ ఇస్తారని తెలుసుకున్నాను. వేల మంది ట్రోల్స్ చేసినా వాటిని పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ సాగిపోవాలని అక్షయ్ సర్ చెప్పారు. ఏదైనా సినిమా పాత్ర కోసం సన్నబడాల్సి వస్తే అది వృత్తిలో భాగం కాబట్టి కచ్చితంగా మారాలని ఆయన సూచించారు. అప్పటి నుంచి నేను ఆ మాటలనే ఫాలో అవుతున్నాను’ అని మృణాల్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మృణాల్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాడీ షేమింగ్ ఎదుర్కొనే వారికి మృణాల్ మాటలు ఒక పెద్ద సపోర్ట్ లా కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!