Site icon NTV Telugu

Mrunal-Dhanush : మొత్తనికి ధనుష్‌తో పెళ్లి వార్తలపై.. రియాక్ట్ అయిన మృణాల్ ఠాకూర్

Danush Mrunal

Danush Mrunal

కొద్ది రోజులుగా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. మృణాల్ ఠాకూర్, ధనుష్ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తే కనిపిస్తోంది. ఫిబ్రవరి 14న వీరిద్దరూ ఒక్కటవుతున్నారని, రహస్యంగా నిశ్చితార్థం కూడా అయిపోయిందని రకరకాల కథలు అల్లేశారు. వీటిపై ఎట్టకేలకు మన ‘సీతమ్మ’ మృణాల్ స్పందించింది. తన స్టైల్లో గట్టిగా క్లారిటీ ఇచ్చింది.

Also Read : Nani-Sujith: నాని సరసన పూజా హెగ్డే.. ఫస్ట్ టైమ్ ఫ్రెష్ జోడి

నా పని చూడండి.. పుకార్లు కాదు! అంటూ మృణాల్ తన పోస్ట్‌లో చాలా స్పష్టంగా చెప్పింది.. ‘నేను ఎప్పుడూ నా సినిమాలతోనే అందరికీ పరిచయం కావాలని కోరుకుంటాను, ఇలాంటి పనికిమాలిన గాసిప్స్‌తో కాదు. కానీ ఈరోజు నా పేరును కొన్ని కట్టుకథలతో ముడిపెట్టడం చూస్తుంటే బాధగా ఉంది. నేను అనని మాటలు, నేను తీసుకోని నిర్ణయాలను నా మీద రుద్దుతున్నారు. ఇవన్నీ కేవలం ఎవరో సృష్టించిన కట్టుకథలు మాత్రమే’ అని మృణాల్ ఘాటుగా రియాక్ట్ అయ్యింది. ప్రస్తుతం మృణాల్ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. ఫిబ్రవరి 20న ఆమె హిందీ సినిమా ‘దో దివానే షెహర్ మే’ రిలీజ్ అవుతోంది. అలాగే టాలీవుడ్‌లో అడివి శేష్‌తో కలిసి ‘డకాయిట్’ మూవీ చేస్తోంది. ఇలా వరుస షూటింగ్స్‌తో బిజీగా ఉన్న తనకు, పెళ్లి చేసుకునే టైమ్ ఎక్కడుందని ఆమె సన్నిహితులు కూడా అంటున్నారు. సో.. మృణాల్ – ధనుష్ పెళ్లి వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది. పుకార్లు పుట్టించే వారికి మృణాల్ తన పోస్ట్‌తో గట్టిగానే చెక్ పెట్టింది.

 

Exit mobile version