NTV Telugu Site icon

Mrunal Thakur : పారితోషకం భారీగా పెంచేసిన మృణాల్ ఠాకూర్..?

Whatsapp Image 2023 07 07 At 9.04.37 Pm

Whatsapp Image 2023 07 07 At 9.04.37 Pm

మృణాల్ ఠాకూర్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తెలుగు లో దుల్కర్‌ సల్మాన్ సరసన సీతారామం సినిమా లో నటించింది.ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఒక్కసారిగా బాగా పాపులర్ అయింది మృణాల్.ప్రస్తుతం ఈ భామ నాని తో ఒక సినిమా లో నటిస్తోంది. ఆ సినిమా చిత్రీకరణ పూర్తి కాబోతుంది.. తాజాగా ఈ అమ్మడు విజయ్ దేవరకొండ సినిమా లో నటించేందుకు ఒప్పుకుంది.ఆ సినిమా షూటింగ్‌ ను మొదలు పెట్టేందుకు గాను ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. తాజాగా ఈ అమ్మడి పారితోషికం గురించి ఆసక్తికర చర్చ జరుగుతున్నట్లు సమాచారం.సీతారామం మరియు నాని సినిమాలకు ఈ భామ కోటి రూపాయల కంటే తక్కువగానే పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. తాజాగా ఈ భామ విజయ్‌ దేవరకొండ సినిమా కు గాను కోటి రూపాయలకు పైగానే పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.

విజయ్‌ దేవరకొండ సినిమాలో నటించే ఛాన్స్ రావడంతో ఈ అమ్మడు ఇంతలా డిమాండ్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇటీవల ఒక నిర్మాత ఆమెను కలిసి ఒక యంగ్‌ హీరో సినిమా కు డేట్లు ఇవ్వమంటూ అడిగినట్లు సమాచారం. ఆ యంగ్‌ హీరో సినిమాకు సుమారు రెండు కోట్ల రూపాయల పారితోషికం డిమాండ్ చేసిందని సమాచారం..ఆ మాటకు షాక్ అయిన నిర్మాత కోటి రూపాయలు మాత్రమే ఇవ్వగలమని చెప్పగానే ఆ సినిమాకు ఆమె నో చెప్పినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. రీసెంట్ గా ఈ భామ లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లో నటించి మెప్పించింది. ఆ సిరీస్ లో మృణాల్ బోల్డ్ సన్నివేశాలలో నటించింది. అలాగే ఇటీవల శృంగారం గురించి అందరి ఇంటిలో బహిరంగంగా చర్చించండి అంటూ వ్యాఖ్యలు కూడా చేసింది ఈ భామ.మృణాల్ కు బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈమె మళ్ళీ బాలీవుడ్ లో మరో వెబ్ సిరీస్ చేయబోతుంది అంటూ వార్తలు కూడా వస్తున్నాయి.