టాలీవుడ్ ‘సీతమ్మ’ మృణాల్ ఠాకూర్ గురించి సోషల్ మీడియాలో ఏ చిన్న వార్త వచ్చినా అది నిమిషాల్లో వైరల్ అవుతుంటుంది. మొన్నటి వరకు ఆమె పెళ్లి గురించి రకరకాల వార్తలు రాగా, ఇప్పుడు ఏకంగా ఆమె బేబీ బంప్‌తో ఉన్న ఒక వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కు గురవుతున్నారు. “పెళ్లి కాకుండానే మృణాల్ ప్రెగ్నెంట్ అయిందా?” అంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Also Read : Animal Park : ‘యానిమల్ పార్క్’ స్టోరీ లీక్ చేసిన సందీప్ వంగా.. ఇద్దరు రణ్‌బీర్‌ల మధ్య మాస్ వార్!
ఆ వైరల్ వీడియోలో మృణాల్ పింక్ కలర్ ఫ్రాక్ ధరించి, బేబీ బంప్‌తో కనిపిస్తోంది. ఆమె పక్కనే బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ఆమె చేయి పట్టుకుని నడుస్తున్నాడు. ఇది చూసిన చాలా మంది నిజంగానే ఆమె గర్భవతి ఏమో అని కంగ్రాట్స్ కూడా చెప్పేస్తున్నారు. అయితే, అసలు విషయం తెలిశాక అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. నిజానికి ఇది మృణాల్, వరుణ్ ధావన్ కలిసి నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్‌కు సంబంధించిన సీన్. ఆ చిత్రంలో మృణాల్ గర్భవతిగా కనిపిస్తుండటంతో, షూటింగ్ గ్యాప్‌లో తీసిన ఈ వీడియో బయటకు వచ్చి ఇలాంటి రూమర్లకు దారితీసింది. సో, మృణాల్ ఫ్యాన్స్ కంగారు పడాల్సిన పనిలేదు, అదంతా కేవలం సినిమా కోసమే!
