Site icon NTV Telugu

Mega 158 : వరప్రసాద్ గారు.. బాబీ కథ కూడా మారిందా?

Chiru 158

Chiru 158

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా కోసం మెగా అభిమానులు మాత్రమే కాదు మూవీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ నటిస్తుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12, 2026న ఈ సినిమా విడుదల కానుంది. నయన తార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే మొదలవగా.. చిత్ర యూనిట్ ఫుల్ జోష్‌లో ఉంది.  నిన్న తిరుపతిలో ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. నెక్ట్స్  జనవరి 7న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత దర్శకుడు బాబీతో తన కెరీర్ లో 158వ సినిమా మొదలు పెట్టనున్నారు మెగాస్టార్. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన బాబీ.. ఈసారి అంతకుమించి అనేలా ప్లాన్ చేస్తున్నాడు. చివరగా బాలయ్య ‘డాకు మహారాజ్’ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు బాబీ. ఇప్పుడు మరోసారి మెగాస్టార్‌తో మాసివ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఇప్పటికే పవర్ ఫుల్ స్క్రిప్టు రెడీ చేసినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు కథ మారినట్టుగా తెలుస్తోంది. ముందు అనుకున్న కథ అదిరిపోయినప్పటికీ ఇంచు మించు అలాంటి కథతోనే రీసెంట్‌గా ఓ సినిమా వచ్చిందట. దీంతో.. మరో కొత్త కథతో సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. బాబీ మాత్రం మెగాస్టార్‌తో గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు. అందులో భాగంగానే ఈ సినిమా కోసం మలయాళ స్టార్ మోహన్ లాల్ ను ముఖ్య పాత్ర కోసం తీసుకోబోతున్నారు.  త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

Exit mobile version