NTV Telugu Site icon

Mr Bachchan vs Double iSmart: బాక్సాఫీస్ క్లాష్.. మాస్ vs మాస్ మహారాజా.. ఏమవుద్దో?

Mr Bachchan Vs Double Ismart

Mr Bachchan Vs Double Ismart

Mr Bachchan vs Double iSmart Releasing on August 15: ప్రస్తుతం టాలీవుడ్ లో రాబోయే కొత్త సినిమాలపై అందరికీ ఆసక్తి నెలకొంది. 2024 ఏడాది రావలసిన బడా చిత్రాలలో ఐకాన్ సార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా పుష్ప 2. అల్లు అర్జున్ పుష్ప మొదటి భాగం సినిమాకు సంబంధించి నేషనల్ అవార్డు కైవసం చేసుకోవడంతో రెండో పార్ట్ పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అయితే షూటింగ్ లో జాప్యం నేపథ్యంలో సినిమాను డిసెంబర్ నెలకు పోస్టుపోన్ చేశారు. మొదటగా ఈ సినిమాను ఆగస్టు 15 రిలీజ్ చేయాలని భావించిన సాంకేతిక కారణాలవల్ల సినిమాని డిసెంబర్ నెలలకు వాయిదా వేశారు. అయితే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా రిలీజ్ వాయిదా పడడంతో అదే డేటుకు టాలీవుడ్ లో రెండు మరో చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి.

Stock Market vs SIP: స్టాక్ మార్కెట్ లేదా ఎస్ఐపీలో ఎందులో పెట్టుబడి ఉత్తమం..

ఇప్పటికే యంగ్ హీరో రామ్ పోతినేని నటించిన సాలిడ్ మాస్ చిత్రం డబుల్ స్మార్ట్ ఆగస్టు 15న రిలీజ్ కానున్నట్లు చిత్ర బృందం తెలిపింది. అయితే మరోవైపు ఇదే డేట్ కి మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్ విడుదల కానున్నట్లు తాజాగా మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. దీంతో ఇద్దరి మధ్య మరోసారి క్లాష్ పడుతుందంటూ టాలీవుడ్ లో సమాచారం. ఇదివరకు కూడా వీరిద్దరి మధ్య ఓసారి క్లాష్ జరిగింది. ఇదివరకు రామ్ పోతినేని నటించిన రెడ్ సినిమా, అలాగే రవితేజ నటించిన క్రాక్ సినిమా ఒకేరోజు విడుదల కాగా అందులో రవితేజ నటించిన క్రాక్ సినిమా భారీ విజయనందుకుంది. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు వీరిద్దరూ నటించిన సినిమాలు ఒకేరోజు విడుదల కాబోతున్నాయి. చూడాలి మరి ఈసారి విజయం ఎవరిని వవరిస్తుందో.

Bigg Boss Season 8: ఈసారి మరింత ఎంటర్టైన్మెంట్ అంటున్న నాగార్జున.. (వీడియో)

Show comments