Site icon NTV Telugu

MPDO’s Transfer : రాష్ట్రంలో భారీగా ఎంపీడీఓల బదిలీలు

Ts Logo

Ts Logo

రాష్ట్రంలో భారీగా ఎంపీడీఓల బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే.. నిన్న డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఎంపీడీఓలను బదిలీ చేసింది. ఈమేరకు రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలో సేవలందిస్తున్న 395 మంది ఎంపీడీవోలను ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సొంత జిల్లాల్లో పని చేస్తున్న వారితో పాటు మూడేళ్లకుపైగా ఒకేచోట పని చేస్తున్న ఉద్యోగులను ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని గతేడాది డిసెంబర్‌లో ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది.

Dairy Milk Chocolate: చాక్లెట్‌లో బ్రతికున్న పురుగు.. హైదరాబాద్ అమీర్‌పేటలో ఘటన

ఈసీ మార్గదర్శకాల మేరకు ప్రభుత్వం 395 మంది మండల పరిషత్‌ డెవలప్‌మెంట్‌ అధికారులను బదిలీ చేసింది తెలంగాణ సర్కార్‌. అయితే.. ఇదిలా ఉండగా.. శనివారం ప్రభుత్వం 32 మంది డిప్యూటీ కలెక్టర్లతో పాటు 132 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మల్టీజోన్-1లో 84 మంది తహసీల్దార్లు, మల్టీజోన్-2లో 48 మంది తహసీల్దార్లను బదిలీ రెవెన్యూ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, రాబోయే రోజుల్లో మరికొన్ని శాఖల్లోనూ అధికారుల బదిలీలు చేపట్టనున్నట్లు తెలుస్తున్నది.

Bandi Sanajay: కొనసాగుతున్న బండి ‘ప్రజాహిత యాత్ర’.. ఈరోజు ఎక్కడంటే..

Exit mobile version