NTV Telugu Site icon

MP YS Avinash Reddy: ఇక నేటి నుండి ప్రతిరోజు వైసీపీలో చేరికలు..

Ys Avinash Reddy

Ys Avinash Reddy

MP YS Avinash Reddy: ఇక, నేటి నుండి ప్రతిరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు మొదలవుతాయని తెలిపారు కడప పార్లమెంట్‌ సభ్యులు వైఎస్‌ అవినాష్‌రెడ్డి.. కడప జిల్లా వేంపల్లిలో ఈ రోజు టీడీపీ నుండి వైఎస్సార్సీపీలోకి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చేశారు.. వైసీపీ నాయకులు సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో 2000 కుటుంబాలు.. టీడీపీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ గూటికి చేరారు.. ఈ సందర్భంగా వారికి వైసీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.. పులివెందుల నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి టీడీపీని వీడి వైసీపీలో భారీగా చేరికలు ఉంటాయని నేతలు చెబుతున్నారు.

Read Also: Liquor Seized: కుప్పంలో భారీగా మద్యం పట్టివేత..

ఇక, ఈ సందర్భంగా ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ.. నేటి నుండి ప్రతిరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ఉంటాయన్నారు. పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం స్వాగతం పలుకుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే విధంగా ప్రతి ఒక కార్యకర్తకు అండగా ఉంటామని వెల్లడించారు. సతీష్ రెడ్డి అన్న ఆలోచనలు.. నా ఆలోచనలు ఒకటేనని స్పష్టం చేశారు. మరోవైపు.. ఈ నెల 27వ తేదీన ఇడుపులపాయలో ప్రారంభమయ్యే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రను విజయవంతం చేయలని కోరారు కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి.