NTV Telugu Site icon

YS Viveka Case: అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై నేడు విచారణ.. సీబీఐ ముందుకు వెళ్తారా?

Mp Avinash Reddy

Mp Avinash Reddy

YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కే సులో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈ రోజు విచారణ జరగనుంది.. అవినాష్‌ రెడ్డి బెయిల్ పిటిషన్ పై సోమవారం రోజు విచారణ జరగగా.. తదుపరి విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది కోర్టు.. మధ్యాహ్నం లోపు అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు తీర్పు ఇచ్చే అవకాశం ఉంది.. ఇక, సోమవారం రోజు అవినాష్‌రెడ్డిని విచారణకు పిలవొద్దని స్పష్టం చేసిన హైకోర్టు.. మంగళవారం నాడు సాయంత్రం 4 గంటలకు విచారించాలని సీబీఐని ఆదేశించింది. అలాగే సునీత ఇంప్లీడ్ పిటిషన్ ను కూడా హైకోర్టు విచారణకు స్వీకరించింది. మంగళవారం ఉదయం పిటిషన్ పై విచారణ చేపడుతామని వెల్లడించింది.

ఇక, వైఎస్‌ భాస్కర్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని అవినాష్‌ రెడ్డి తరపున న్యాయవాది వాదించారు. కోర్టులో భాస్కర్ రెడ్డి పిటిషన్ పెండింగ్ లో ఉండగా అరెస్ట్ చేశారని తెలిపారు. పిటిషన్ విచారణ మాత్రమే జరుగుతుంది కదా అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు ఇవ్వలేదు కదా అని న్యాయమూర్తి చెప్పారు. భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి దస్తగిరి కాంఫెషన్స్ తప్ప ఇంకా ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. దస్తగిరిని సీబీఐ బెదిరించినట్లు, చిత్రహింసలకు గురిచేసినట్లు ఎర్రగంగిరెడ్డి చెప్పాడని అవినాష్‌ రెడ్డి తరపు లాయర్ పేర్కొన్నాడు. దస్తగిరి సీబీఐకి భయపడి భాస్కర్ రెడ్డి, అవినాష్‌ రెడ్డిలకి వ్యతిరేకంగా స్టేట్ మెంట్ ఇచ్చాడని అన్నారు. అవినాష్‌ రెడ్డి సహా నిందితుడు అంటూ ప్రచారం జరుగుతుందన్నారు. దస్తగిరికి బెయిల్ వచ్చిన తరువత రోజే సీబీఐ 306 పిటిషన్ వేశారని.. ఆయన్ని అప్రూవర్ గా మార్చారని పేర్కొన్నారు.

కాగా, సీబీఐ నోటీసుల మేరకు సోమవారం విచారణలో భాగంగా హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయానికి అవినాష్‌రెడ్డి హాజరయ్యే క్రమంలో విచారణను మంగళవారానికి వాయిదా వేసింది హైకోర్టు.. దీంతో, ఈ మేరకు అవినాష్‌రెడ్డికి సీబీఐ మరో నోటీసు ఇచ్చింది. మరి, అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు ఎలా సాగనున్నాయి.. హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుంది.. ఈరోజు సీబీఐ అవినాష్‌రెడ్డిని ప్రశ్నిస్తుందా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది.