NTV Telugu Site icon

MP Vijayasai Reddy: మధ్యంతర ఎన్నికలు వస్తే మళ్లీ అధికారం వైసీపీదే..!

Vijayasai Reddy

Vijayasai Reddy

MP Vijayasai Reddy: మధ్యంతర ఎన్నికలు వస్తే మళ్లీ అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీయే అన్నారు ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.. అధికారంలోకి వచ్చిన తర్వాత హద్దులు దాటిన వాళ్ల తోకలు కత్తిరించడం ఖాయమని హెచ్చరించారు.. ఇదేనే ప్రభుత్వం పనితీరు..? అని ప్రశ్నించిన ఆయన.. రాష్ట్రంలో నెలరోజుల్లో రాక్షస పాలనను ప్రజలు గమనిస్తున్నారు.. అధికార పార్టీ పతనం స్టార్ట్ అయ్యిందన్నారు. వైసీపీ నేతలపై నిరాధార ఆరోపణలు, బురదజల్లేడం ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతోందని ఆరోపించారు.. నా పరువు తీసేందుకు ప్రయత్నం చేశారో అది మా పార్టీ వాళ్ళైనా, ఇతర పార్టీల వాళ్లైన వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు.. నా మీద కుట్రలు బయటపెడతాను… విజయసాయిరెడ్డి పంతం పడితే ఎలా వుంటుందో చేసి చూపిస్తాను అని వార్నింగ్‌ ఇచ్చారు..

Read Also: Mallu Bhatti Vikramarka: ప్రతీ పైసా ప్రజా సంక్షేమం కోసమే ఖర్చు పెడతాం..

మరోవైపు.. త్వరలోనే న్యూస్ ఛానల్ ప్రారంభిస్తానని తెలిపారు ఎంపీ సాయిరెడ్డి.. గతంలోనే ప్రకటించినా.. ఆలస్యం చేసినందుకు బాధపడుతున్నానన్న ఆయన.. ఎవరు అడ్డువచ్చినా ఛానల్ ఏర్పాటులో వెనక్కి తగ్గేది లేదన్నారు. కులాలికి, మతాలికి, రాజకీయ పార్టీలకు అతీతంగా న్యూట్రల్ ప్లాట్ ఫార్మ్ మీద పని చేస్తుందని ప్రకటించారు.. తప్పులు చేసే వాళ్ళను వదలం… ప్రజల అవసరాల కోసం, ప్రభుత్వ అస్తుల రక్షణ కోసం పనిచేశాను.. ఎటువంటి చర్యలకు అయిన సిద్ధం అని ప్రకటించారు వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.. ఇంకా మీడియా సమావేశంలో.. ఎంపీ ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..