NTV Telugu Site icon

Vijaysai Reddy: చంద్రబాబును చూస్తుంటే జాలి వేస్తుంది.. పాపం..!

Vujayasai

Vujayasai

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు పోలింగ్‌కు ముగిసింది. ఇక, జూన్‌ 4వ తేదీన తుది ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కాగా, సర్వేలన్నీ మళ్లీ వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీనే ఘన విజయం సాధించబోతుందని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై విజయసాయిరెడ్డి సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ‘చంద్రబాబు.. పోయినసారి 23 మంది మా పార్టీ ఎమ్మెల్యేలను కొన్నావు.. 2019 ఎన్నికలలో మీకు వచ్చింది 23 స్థానాలే.. ఈసారి మా వాళ్ళను నలుగురిను ( కోటంరెడ్డి, ఆనం, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి) కొన్నావు.. జూన్‌ 4వ తేదీన కౌంటింగ్ జరగబోతుంది.. ఈసారి ఎన్ని సీట్లకు పరిమితం కాబోతున్నావో ఈపాటికే నీకు అర్థమై ఉంటుంది కదా చంద్రబాబూ?.. ఈ లెక్కన నువ్వు నాలుగు స్థానాలకే పరిమితం కాబోతున్నావని తెలిసి.. నీ మీద జాలేస్తోంది అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యనించారు.

Read Also: Keerthy Suresh Lip Lock: లిప్ లాక్‌కి ఓకే చెప్పిన కీర్తి సురేష్.. ఆ పెళ్లయిన హీరోకి పండగే!

ఇక, ఈ నెల 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. తుది ఫలితాలు వచ్చే నెల 4వ తేదీన రానున్నాయి. దీంతో గెలుపు మాది అంటే మాది అని టీడీపీ, వైసీపీ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఏపీలో పలు చోట్ల దాడులు కొనసాగుతుండటంతో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. కాగా, ఇప్పటికే రాష్ట్రంలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. కౌంటింగ్ సమయానికి రాష్ట్రంలో ఎలాంటి గొడవలు జరగకూండ తగిన ఏర్పాట్లు చేశారు.

Show comments