NTV Telugu Site icon

Vijayasai Reddy: దేశంలో ఎవరూ చట్టానికి అతీతులు కాదు

Vijay Sai

Vijay Sai

స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు.. చంద్రబాబు పద్నాలుగేళ్ల పరిపాలనలో ఒక దృఢమైన అభిప్రాయానికి వచ్చాడని తెలిపారు. ఎన్ని అన్యాయాలు చేసినా, అధికార దుర్వినియోగానికి పాల్పడినా చట్టం నుంచి తప్పించుకోవచ్చని భావించాడని పేర్కొన్నారు. ఏ కేసయినా స్టేలతో తెచ్చుకోవచ్చని చంద్రబాబు ఆలోచన.. కుట్రలతో, కుతంత్రాలతో బయటపడటం చంద్రబాబు నైజమని విమర్శించారు. చట్టానికి లోబడి ఎవరైనా పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. దేశంలో ఎవరూ చట్టానికి అతీతులు కాదని కోర్టు తీర్పు ద్వారా నిరూపితం అయ్యిందని విజయసాయి రెడ్డి అన్నారు.

Chandrababu Arrested Live Updates: చంద్రబాబుకు రిమాండ్

చంద్రబాబు మీద పెట్టిన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో పక్కా దృఢమైన ఆధారాలతో పెట్టడం జరిగిందని ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. ఈ ఒక్క కేసే కాదు.. ఇంకా చంద్రబాబు మీద ప్రాసిక్యూట్ చేయాల్సినవి ఇంకా ఆరేడు కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. చట్టాన్ని తృణప్రాయంగా తన చేతిలో ఉన్న ఒక ఆయుధంగా మలుచుకుని తప్పించుకుంటూ వస్తున్నాడని ఆరోపించారు. ఇక మీదట అలా జరగదని.. జగన్ సీఎంగా ఉండగా గతంలో చంద్రబాబు ఎలాంటి అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డాడో వెలికి తీయటం జరుగుతుందని విజయసాయి తెలిపారు. ఏ రకంగా ఆంధ్ర రాష్ట్ర సొమ్మును దోచుకున్నాడో బయటకు తెస్తామని చెప్పారు. చంద్రబాబు అవినీతి సొమ్మును విదేశాలకు ఎలా తరలించారో బయట పడుతుందని పేర్కొ్న్నారు.

Video Viral: కుక్క ట్రాక్టర్ సీటును పాడు చేసిందని.. ఎలా ఉరితీశాడో చూడండి

జ్యుడీషియల్ రిమాండ్ తో పాటు పోలీస్ రిమాండ్ ఉంటుందని విజయసాయి అన్నారు. చంద్రబాబు అవినీతిపై సరిగ్గా విచారణ జరిగితే జీవిత కాలంలో బయటకు రాడని ఆరోపించారు. చంద్రబాబుతో పాటు రామోజీరావు కూడా చాలా దారుణాలు, అకృత్యాలకు పాల్పడ్డాడని దుయ్యబట్టారు. గతంలో నేరాలకు పాల్పడ్డ వారందరినీ చట్ట పరిధిలోకి తీసుకువస్తామని.. తప్పు చేసిన ప్రతీ ఒక్కరికీ శిక్ష పడేలా చేయాల్సిన భాధ్యత ప్రభుత్వం పై ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్నత స్థాయి పదవులు చేపట్టిన వ్యక్తి అవినీతి గురించి కేసులు పెడితే రాజకీయ కక్ష్య సాధింపు అవుతుందా అని ప్రశ్నించారు. ప్రభుత్వం తన ధర్మం తాను నెరవేరుస్తుందని విజయసాయి రెడ్డి తెలిపారు.