NTV Telugu Site icon

MP Vijayasai Reddy: చంద్రబాబుపై తీవ్ర విమర్శలు.. రాజ్యసభలో విరుచుకుపడ్డ సాయిరెడ్డి

Vijayasai Reddy

Vijayasai Reddy

MP Vijayasai Reddy: టీడీపీ అధినేత చంద్రబాబుపై రాజ్యసభ వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు విజయసాయి రెడ్డి.. అంతులేని అవినీతి, కుంభకోణాలు, వెన్నుపోట్లకు కేరాఫ్‌ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడని విమర్శించారు. ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళ చంద్రబాబు పాలన కారణంగానే ఆంధ్రప్రదేశ్‌ వెనుకబడిన రాష్ట్రంగా మిగిలిపోయింది. అడ్డూఅదుపూ లేకుండా అవినీతి, స్కామ్‌లకు పాల్పడి చంద్రబాబు ఈరోజున 6 లక్షల కోట్లకు అధిపతి అయ్యారు. తనపై తొమ్మిది క్రిమినల్‌ కేసులు ఉన్నట్లుగా చంద్రబాబు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిడ్‌లో పేర్కొనడాన్నిబట్టి ఆయన క్రిమినల్‌ నేపధ్యాన్ని అర్ధం చేసుకోవచ్చని శ్రీ విజయసాయి రెడ్డి అన్నారు. రాజకీయాలలో వెన్నుపోట్లు అనేవి చంద్రబాబుతోనే మొదలయ్యాయి. టీడీపితో పొత్తు పెట్టుకున్న బిజెపి, కాంగ్రెస్‌ పార్టీ, కమ్యూనిస్టులను వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుది. ఇదీ మన ప్రజాస్వామ్యం దుస్థితి అని దుయ్యబట్టారు.

Read Also: Heavy Rains: ప్రమాదకర స్థాయిలో నర్మదా.. 12 వేల మంది తరలింపు

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా పాల్పడిన కోట్లాది రూపాయల స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అవినీతి కేసులో నిందితుడిగా పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్‌ సిఐడి ఆయను అరెస్ట్‌ చేసింది. ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లుగా నిర్ధారించకున్న తర్వాతే కోర్టు చంద్రబాబుకు జుడిషియల్‌ కస్టడీ విధించింది. దీనిపై ఒకవైపు న్యాయప్రక్రియ కొనసాగుతుండగానే మరోవైపు చంద్రబాబు అరెస్టుపై అఖిలపక్ష సమావేశంలో టిడిపి సభ్యులు రాష్ట్ర ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలతో యాగీ చేయడానికి ప్రయత్నించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. పార్లమెంట్‌ 75 ఏళ్ళ ప్రస్థానంపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో మాట్లాడుతూ టిడిపి పార్లమెంట్‌ సభ్యుల అనుచిత చర్యలకు సమాధానంగానే ఈరోజు చంద్రబాబు అవినీతి కుంభకోణాలు, నేర చరిత్ర గురించి సభలో ప్రస్తావించాల్సి వస్తోందని పేర్కొన్నారు విజయసాయిరెడ్డి.

Show comments